మూడో వన్డే: కెప్టెన్ కోహ్లీకి ధోని ఇచ్చిన గిప్ట్ ఇదే
హైదరాబాద్: పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ధోని నుంచి బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ తన తొలి ఎస్సైన్మెంట్‌లో విజయవంతమయ్యాడు. కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయం అందుకున్న విరాట్ కోహ్లికి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఓ అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు.
ఈ విషయాన్ని కోహ్లీయే బీసీసీఐ టీవికి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పాడు. రెండో వన్డేలో విజయం సాధించిన అనంతరం ధోని సంతకం చేసిన బంతిని తనకు ఇచ్చాడని తెలిపాడు. తొలి వన్డే సిరీస్ విజయం ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని ధోని తనతో అన్నాడని చెప్పాడు.

ధోని సంతకంతో కూడిన బంతి
తొలి విజయం సాధించిన సందర్భంగా తనకు తన సంతకంతో కూడిన బంతిని ప్రజెంట్ చేశాడని కోహ్లీ చెప్పాడు. ప్రస్తుతం స్టంప్స్ చాలా ఖరీదైనవిగా మారాయని, అందుకే వాటిని ఇంటికి తీసుకెళ్లనీయడం లేదని కోహ్లీ నవ్వుతూ చెప్పాడు.

ధోని ఆటోగ్రాఫ్ ఉన్న బంతిని అందుకోవడం ప్రత్యేకం
సిరీస్ గెలవడంతో పాటు ధోని ఆటోగ్రాఫ్ ఉన్న బంతిని అందుకోవడం కూడా తనకు ప్రత్యేకమేనని కోహ్లీ అన్నాడు. ఇంగ్లాండ్‌తో ముగిసిన సిరిస్‌లో టీమిండియా విజయం వెనుక జట్టు సభ్యులందరి పాత్ర ఉందని అన్నాడు.

కెప్టెన్‌గా ఇంకేం కావాలి
వచ్చిన అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకున్నారని, ఇంతకు మించి కెప్టెన్‌గా తనకు ఇంకేం కావాలని కోహ్లీ అన్నాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరిస్‌లో యువ ఆటగాళ్లు కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యాల ఆటతీరుపై విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు.

ఈ సిరిస్‌లో సెంచరీతో పాటు అర్ధ సెంచరీ చేసిన కోహ్లీ
ఇంగ్లాండ్‌తో ముగిసిన సిరిస్‌లో కెప్టెన్‌గా సిరీస్ గెలవడంతో పాటు బ్యాటింగ్‌లో సైతం సత్తా చాటాడు. ఈ సిరిస్‌లో ఓ సెంచరీ, అర్ధ సెంచరీ చేశాడు. ఇదిలా ఉంటే భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి 26న కాన్పూర్ వేదికగా మొట్టమొదటి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications