
అత్యధిక పరుగుల జాబితాలో మార్టిన్ గుప్టిల్ అగ్రస్థానం
న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ 2,271 పరుగులతో టీ20ల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌కే చెందిన బ్రెండన్ మెక్కల్లమ్ 2,140 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ 2,039 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

56వ ఇన్నింగ్స్‌లో రెండువేల పరుగుల మైలురాయిని
కాగా, ఈ మైలురాయిని చేరుకోవడానికి మెక్‌కల్లమ్ 66 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, కోహ్లీ కేవలం 56వ ఇన్నింగ్స్‌లో రెండువేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇక, మార్టిన్ గుప్టిల్ 68వ ఇన్నింగ్స్‌లో, షోయబ్ మాలిక్ 92వ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. 60 టీ20 మ్యాచ్‌లాడిన కోహ్లీ తన 56వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు.

56 ఇన్నింగ్స్‌ల్లో 49.07 యావరేజితో 2012 పరుగులు
56 ఇన్నింగ్స్‌ల్లో 49.07 యావరేజితో 2012 పరుగులు చేశాడు. అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలోనూ పలు రికార్డులు నమోదు చేసిన కోహ్లీని టీ20ల్లో సెంచరీ కోరిక మాత్రం ఊరిస్తూనే ఉంది. మరో భారత క్రికెటర్ రోహిత్ శర్మ 19 పరుగులు చేస్తే టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా, ఓవరాల్‌గా ఐదో ప్లేయర్‌గా నిలుస్తాడు.

తొలి టీ20లో ఇంగ్లాండ్‌పై టీమిండియా ఘన విజయం
ఇదిలా ఉంటే మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(5/24) చెలరేగగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో లోకేశ్ రాహుల్(101; 54 బంతుల్లో 10ఫోర్లు, 5సిక్సర్లు) అజేయ సెంచరీని నమోదు చేశాడు.


Click it and Unblock the Notifications


