Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: రెండో టీ20లో హాఫ్ సెంచరీ.. విరాట్ కోహ్లీ బద్దలు కొట్టిన 5 రికార్డులు ఇవే!!

India vs England: Virat Kohli become the first batsman to score 3000 runs in T20Is

అహ్మదాబాద్: ఓటమితో టీ20 సిరీస్‌ను ఆరంభించిన భారత్ ఆదివారం మొతేరాలో జరిగిన రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మోర్గాన్ సేన 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్‌ జేసన్ రాయ్‌ (46; 35 బంతుల్లో 4×4, 2×6) రాణించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ (2/29), శార్దూల్‌ ఠాకూర్‌ (2/29) సత్తాచాటారు. ఛేదనలో విరాట్ కోహ్లీ (73 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4, 3×6), అరంగేట్ర ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్ (56; 32 బంతుల్లో 5×4, 4×6) అర్ధ శతకాలతో టీమిండియాకు విజయాన్ని అందించారు. భారత్‌ 3 వికెట్లు కోల్పోయిన 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.

తొలి బ్యాట్స్‌మెన్‌గా:

తొలి బ్యాట్స్‌మెన్‌గా:

రెండో టీ20 ద్వారా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. 49 బంతుల్లోనే 73 పరుగులు చేయడంతో టీ20 క్రికెట్లో కోహ్లీ సాధించిన పరుగుల సంఖ్య 3వేల మైలురాయిని దాటింది. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. న్యూజీలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (2,839), టీమిండియా స్టార్ ఓపెనర్ (2,773) పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టీ20ల్లో సిక్స్ ద్వారా నాలుగు సార్లు కోహ్లీ మ్యాచ్ పూర్తిచేశాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మూడుసార్లు సిక్స్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు.

టీ20ల్లో 26 అర్ధ సెంచరీలు:

టీ20ల్లో 26 అర్ధ సెంచరీలు:

టీ20ల్లో విరాట్‌ కోహ్లీ 26 సార్లు అర్ధ సెంచరీలు బాదాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక 50లు అతడివే. రోహిత్ శర్మ (25), డేవిడ్ వార్నర్ (19), మార్టిన్ గుప్టిల్ (19) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 12వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా కూడా విరాట్ నిలిచాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (15440), దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ (14878) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మూడో కెప్టెన్‌గా:

మూడో కెప్టెన్‌గా:

ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 12000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. రికీ పాంటింగ్ (15440), గ్రేమ్ స్మిత్ (14878) కోహ్లీ కన్నా ముందున్నారు. 12 వేల పరుగులు పూర్తిచేయడానికి కోహ్లీకి కేవలం 226 ఇన్నింగ్సులే పట్టింది. రికీ పాంటింగ్ (282), గ్రేమ్ స్మిత్ (294) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కెప్టెన్‌ల రికార్డుల జాబితాలో పాంటింగ్, స్మిత్‌లతో కోహ్లీ పోటీ పడుతున్నాడు.

 సచిన్ 30000:

సచిన్ 30000:

టీమిండియా ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలు పలు రికార్డులు తమ పేరుపై లిఖించుకున్నారు. 10000 టెస్ట్ పరుగులు పూర్తిచేసిన మొదటి ఆటగాడిగా గవాస్కర్ రికార్డు సృష్టించగా.. 30000 అంతర్జాతీయ పరుగులు అందుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా సచిన్ నిలిచాడు. 18000 వన్డే పరుగులు పూర్తిచేసిన మొదటి ఆటగాడిగా సచిన్ నిలవగా.. 3000 టీ20 రన్స్ అందుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా విరాట్ నిలిచాడు.

Story first published: Monday, March 15, 2021, 9:42 [IST]
Other articles published on Mar 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+