Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: అశ్విన్ సూపర్ ఇన్నింగ్స్.. టీమిండియా ఆధిక్యం 416!!

India vs England: Virat Kohli and Ravichandran Ashwin forged an important stand after 6 wickets

చెన్నై: చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ ఆధిక్యంలో నిలిచింది. భారత్ మూడో రోజు టీ స‌మ‌యానికి రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల‌కు 221 ప‌రుగులు చేసింది‌. దీంతో టీమిండియా ఆధిక్యం 416కు చేరింది. ప్రస్తుతం క్రీజులో రవిచంద్రన్ అశ్విన్ (68), ఇషాంత్ శర్మ (0) ఉన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండ్ అశ్విన్ హాఫ్ సెంచ‌రీలు చేయ‌డంతో ఇండియ‌న్ టీమ్‌కు భారీ లీడ్ దక్కింది. అయితే టీ బ్రేక్ ముందు కోహ్లీ (62)ని మొయిన్‌ అలీ ఔట్ చేశాడు. కోహ్లీ ఔటైన అనంతరం క్రీజులోకొచ్చిన కుల్దీప్ యాదవ్ కూడా‌.. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు.

ఒక ద‌శ‌లో 106 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయినా.. కోహ్లీ, అశ్విన్ ఏడో వికెట్‌కు 96 ప‌రుగులు జోడించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో అశ్విన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కోహ్లీతో కలిసి చక్కని ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్.. ఏడో వికెట్‌కు అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించాడు. ఇదే క్రమంలో 65 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో తనకిది 12వ అర్ధసెంచరీ. అశ్విన్-కోహ్లీ జోడీని అలీ విడగొట్టాడు. 62 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులో వచ్చిన కుల్దీప్ కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ట‌ర్నింగ్ పిచ్‌పై బ్యాటింగ్ చేయ‌డం క‌ష్టంగా మారుతోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఇండియ‌న్ టీమ్ విజ‌యావ‌కాశాలు మెండుగా ఉన్నాయి.

ఇంగ్లండ్‌తో చెపాక్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టుపై టీమిండియా పట్టు బిగిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన కోహ్లీసేన.. స్పిన్నర్ల మాయాజాలంతో రెండో రోజు ఆటలో ఇంగ్లిష్‌ జట్టును 134 పరుగులకే కట్టడిచేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌‌ బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. వరుస వికెట్లు కోల్పోయినా కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ప్రస్తుతం అశ్విన్ ఆ బాడీతను తీసుకున్నాడు.

ఈ మ్యాచులో రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు, హాఫ్ సెంచరీ చేశాడు. ఒకే టెస్టులో అశ్విన్ ఐదు వికెట్లు, హాఫ్ సెంచరీ చేయడం ఇది ఆరోసారి. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (4), రవీంద్ర జడేజా (4), భువనేశ్వర్ కుమార్ (2) అశ్విన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరో 13 మంది ఒకే టెస్టులో ఐదు వికెట్లు, హాఫ్ సెంచరీని 13 సార్లు సాధించారు.

Story first published: Monday, February 15, 2021, 15:09 [IST]
Other articles published on Feb 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+