For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అజారుద్దీన్‌ను అధిగమించిన కెప్టెన్ కోహ్లీ

India vs England: Unstoppable Virat Kohli breaks record held by Mohammad Azharuddin

ఇంగ్లాండ్: విరాట్ కోహ్లీ మూడో టెస్టులో మరింత ప్రమాదకారిగా మారతాడని ఇంగ్లీషు జట్టు కోచ్ ట్రెవర్ బేలిస్ అన్నట్లుగానే తయారైంది పరిస్థితి. విరాట్ కోహ్లి సెంచరీతో మెరిసిన వేళ నాటింగ్‌హామ్ టెస్టులో భారత్ విజయానికి రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. పది వికెట్లు కూల్చితే విజయం భారత్‌ సొంతం అవుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో కొద్దిలో సెంచరీ చేజార్చుకున్న కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తా చాటాడు.

India VS England 3rd Test: Virat Kohli Crosses Ms Dhoni's Record

భారత్ ఏడు వికెట్ల నష్టానికి 352 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లాండ్‌కు 521 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు భారత్ నిర్దేశించిన అతిపెద్ద టార్గెట్ ఇదే కావడం గమనార్హం. 2007లో ఓవల్ టెస్టులో టీమిండియా ఇంగ్లాండ్‌కు 500 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 200 పరుగులు చేసిన కోహ్లి ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ 440 పరుగులు చేశాడు.

1
42376

తద్వారా ఇంగ్లాండ్ గడ్డ మీద ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా విరాట్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ అజారుద్దీన్ (426) పేరిట ఉంది. కోహ్లి మరో ఆరు పరుగులు చేస్తే టెస్టుల్లో 6000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఓ టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డ మీద అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ కూడా కోహ్లినే కావడం విశేషం. 2014-15లో ఆస్ట్రేలియాపై 449 పరుగులు చేసిన విరాట్.. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికాలో 286 రన్స్ చేశాడు.

ఇంగ్లాండ్ గడ్డ మీద ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకూ నమోదైన భారీ లక్ష్య చేధన 507/7 మాత్రమే. ఎంసీసీ జట్టుపై 1896లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఈ ఫీట్ సాధించింది. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతోన్న ట్రెంట్ బ్రిడ్జి మైదానంలో కేంబ్రిడ్జి జట్టే నాటింగ్‌హమ్‌షేర్‌పై 502 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. అది కూడా 1925లో కావడం గమనార్హం. అంతర్జాతీయ మ్యాచ్‌ల విషయానికి వస్తే 1948లో లీడ్స్ వేదికగా జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా 404 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది.

Story first published: Tuesday, August 21, 2018, 9:30 [IST]
Other articles published on Aug 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+