
జహీర్ ఖాన్‌తో కలిసి:
అత్యంత తక్కువ టెస్టుల్లో 150 టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. కపిల్ 39 మ్యాచుల్లోనే 150 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాతి స్థానాల్లో మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (40), సీనియర్ ఫేస్ బౌలర్ మహహ్మద్ షమీ (42)లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. 150 వికెట్ల ఫీట్‌ను అందుకున్న టీమిండియా బౌలర్లలో జహీర్ ఖాన్‌తో కలిసి ప్రస్తుతం ఉమేశ్ యాదవ్ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (54) తర్వాతి స్థానంలో ఉన్నాడు.

కుంబ్లే1:
కపిల్ దేవ్ మొత్తంగా 434 టెస్ట్ వికెట్లు పడగొట్టగా.. జహీర్ ఖాన్ 311, ఇషాంత్ శర్మ 311, జవగళ్ శ్రీనాథ్ 236, మహమ్మద్ షమీ 195, ఉమేశ్ యాదవ్ 150, కర్సన్ ఘవ్రీ 109, ఇర్ఫాన్ పఠాన్ 100 వికెట్లు సాధించారు. భారత బౌలర్లలో అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన జాబితాలో అనిల్ కుంబ్లే 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417), రవిచంద్రన్ అశ్విన్ (413), ఇషాంత్ శర్మ (311), జహీర్ ఖాన్ (311), బిషన్ సింగ్ బేడీ (266), బీఎస్ చంద్రశేఖర్ (242), జవగళ్ శ్రీనాథ్ (236), రవీంద్ర జడేజా (225), మహమ్మద్ షమీ (195)లు వరుసగా ఉన్నారు.

షమీ స్థానంలో ఉమేష్:
మొదటి మూడు టెస్టుల్లో ఉమేశ్ యాదవ్‌కు అవకాశం ఇవ్వలేదు. అయితే నాలుగో టెస్టులో మొహ్మద్ షమీ స్థానంలో జట్టులోకి వచ్చాడు. రొటేషన్ పాలసీ, టీ20 ప్రపంచకప్ 2021ని దృష్టిలో ఉంచుకుని షమీకి కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతిని ఇచ్చాడు. మూడు టెస్టులు ఆడిన ఇశాంత్ శర్మకు కూడా జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతిని ఇవ్వగా.. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచాడు. ఇక షమీ స్థానంలో వచ్చిన ఉమేశ్.. తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఇప్పటికే నాలుగో టెస్టులో డేవిడ్ మలాన్, జో రూట్, క్రెయిగ్ ఓవర్టన్‌లను ఉమేశ్ పెవిలియన్ చేర్చాడు.

జట్టులోకి ఎంపికవుతున్నా:
2015 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉమేష్ యాదవ్ నిలిచాడు. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ లాంటి సీనియర్లు.. దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ, టీ నటరాజన్ వంటి యువకులు వచ్చాక అతడికి అవకాశాలు తగ్గాయి. ఎట్టకేలకు ఉమేశ్ 2018లో వెస్టిండీస్‌పై వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఆడాడు. ఇప్పడు ఇంగ్లండ్ పర్యటనలో ఆడుతున్నాడు. ఇటీవలి జట్టులోకి ఎంపికవుతున్నా.. ఎక్కువగా బెంచ్ మీదే ఉంటున్నాడు.


Click it and Unblock the Notifications












