లార్డ్స్‌లో వరల్డ్ కప్ ఫైనల్: హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు
హైదరాబాద్: ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. ఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కి ఐసీసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఫైనల్ మ్యాచ్‌కి అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు పోటీ పడుతున్నారు.
ఫైనల్ మ్యాచ్‌కి సంబంధించి ఇప్పటికే 26,500 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక మిగిలిన టికెట్లను ఎంసీసీ మెంబర్స్ కొనుగోలు చేయనున్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి ఉమెన్ వరల్డ్ కప్‌ని కవర్ చేసేందుకు మీడియా కూడా పోటీ పడింది.
గ్రూప్ స్టేజీలో జరిగిన మ్యాచ్‌లను ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 50 మిలియన్ అభిమానులు వీక్షించారు. ఇక ఐసీసీ వీడియోలను అయితే 75 మిలియన్ సార్లు వీక్షించారు. నిజంగా గతంలో జరిగిన ఐసీసీ టోర్నీలతో పోలిస్తే ఇది రికార్డేనని ఐసీసీ నిర్వాహకులు చెబుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications