For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: కోహ్లి స్థానంలో ఆ యువ ప్లేయర్ ఎంపిక - బీసీసీఐ

ఇంగ్లాండ్‌తో జరగనున్న తొలి రెండు టెస్టులకు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో దూరమైన విషయం తెలిసిందే. ఆదివారమే హైదరాబాద్‌కు చేరుకున్న కోహ్లి కొన్ని కారణాలతో తిరిగి బయలుదేరాడని బీసీసీఐ వివరించింది. అయితే అతడి స్థానంలో యువ ప్లేయర్‌ రజత్ పటిదార్‌ను బీసీసీఐ ఎంపిక చేసినట్లు సమాచారం.

కోహ్లి స్థానంలో చోటు దక్కించుకోవడానికి ముగ్గురు ఆటగాళ్లు పోటీపడ్డారు. టీమిండియా టెస్టు స్టార్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారాతో పాటు యువ ప్లేయర్లు సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్‌ పోటీలో నిలిచారు. ఇండియా-ఎ జట్టు తరపున సర్ఫరాజ్, రజత్ గత కొన్నాళ్లుగా సత్తాచాటుతున్నారు. గత వారంలో రజత్ పటిదార్ ఇంగ్లాండ్ లయన్స్‌పై పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీ, అనధికారిక తొలి టెస్టులో 151 పరుగులు చేశాడు.

India vs England: The Young player likely to select in Virat Kohlis place

అంతేగాక రజత్ పటిదార్ మిడిలార్డర్‌లో రాణిస్తుండటంతో, కోహ్లి ప్లేస్‌లో అతడికే సెలక్టర్లు మొగ్గు చూపారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రింకూ సింగ్‌ను ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండో టెస్టుకు కూడా భారత్-ఎ జట్టులో ఎంపిక చేశారు. తొలుత రింకూను మూడో టెస్టులో మాత్రమే ఎంపిక చేశారు. కానీ కోహ్లి దూరమవ్వడంతో రింకూ ఇండియా-ఎ జట్టులో చేర్చారు.

మరోవైపు సీనియర్ల బ్యాటర్లు పుజారా, అజింక్య రహానె అందుబాటులో ఉన్నప్పటికీ సెలక్టర్లు వారిపై ఆసక్తి చూపట్లేదు. రహానె రంజీ ట్రోఫీలో విఫలమవుతున్నాడు. కానీ పుజారా సౌరాష్ట్ర తరపున అదరగొడుతున్నాడు.ఇటీవల అరుదైన రికార్డు కూడా సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20వేల పరుగులు సాధించిన భారత నాలుగో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ , రాహుల్ ద్రవిడ్ , పుజారా మాత్రమే ఇప్పటివరకు ఈ ఘనత సాధించారు.

అంతేగాక 35 ఏళ్ల పుజారా జార్ఖండ్‌‌పై డబుల్ సెంచరీ సాధించాడు. అజేయంగా 243 పరుగులు చేశాడు. ఆ తర్వాత జరిగిన హర్యానా మ్యాచ్‌లోనూ 49, 43 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. విదర్భపై 43, 66 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ యువ ప్లేయర్ రజత్ పటిదార్‌కే సెలక్టర్లు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు.

India vs England: The Young player likely to select in Virat Kohlis place


కాగా, తొలి రెండు టెస్టులకు మాత్రమే టీమిండియాను సెలక్టర్లు ప్రకటించారు. చివరి మూడు టెస్టులకు జట్టును ఇంకా ఖరారు చేయలేదు. జనవరి 25 నుంచి ప్రారంభమయ్యే అయిదు టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు ఉప్పల్ వేదికగా జరగనుంది. విశాఖపట్నంలో జరగనున్న రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుంది. చివరి మూడు టెస్టులు రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల వేదికగా జరగనున్నాయి.

తొలి రెండు టెస్టులకు ఎంపికైన టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్

ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్

Story first published: Wednesday, January 24, 2024, 9:11 [IST]
Other articles published on Jan 24, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+