For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: కోహ్లి స్థానంలో ఆ స్టార్ ప్లేయర్ రీఎంట్రీ!

ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ప్రారంభంకాక ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. అయితే అతడి స్థానంలో మరో ప్లేయర్‌ను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆ స్థానం కోసం ముగ్గురు ఆటగాళ్లను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీమిండియా టెస్టు స్టార్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారాతో పాటు యువ ప్లేయర్లు సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఇండియా-ఎ జట్టు తరపున సర్ఫరాజ్, రజత్ గత కొన్నాళ్లుగా సత్తాచాటుతున్నారు. అయితే పుజారా రంజీ ట్రోఫీలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సౌరాష్ట్ర తరపున ఆడుతూ పరుగుల వరద పారిస్తూ ఇటీవల అరుదైన రికార్డు కూడా సాధించాడు.

India vs England: The star player re-entry in Virat Kohlis place

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20వేల పరుగులు సాధించిన భారత నాలుగో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ , రాహుల్ ద్రవిడ్ , పుజారా మాత్రమే ఇప్పటివరకు ఈ ఘనత సాధించారు. అంతేగాక 35 ఏళ్ల పుజారా జార్ఖండ్‌‌పై డబుల్ సెంచరీ సాధించాడు. అజేయంగా 243 పరుగులు చేశాడు. ఆ తర్వాత జరిగిన హర్యానా మ్యాచ్‌లోనూ 49, 43 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. విదర్భపై 43, 66 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, పుజారా గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అనంతరం టీమిండియాకు దూరమయ్యాడు.

మరోవైపు తొలి రెండు టెస్టులకు మాత్రమే టీమిండియాను సెలక్టర్లు ప్రకటించారు. చివరి మూడు టెస్టులకు జట్టును ఇంకా ఖరారు చేయలేదు. కాగా, కోహ్లి తొలి రెండు టెస్టులకు మాత్రమే అందుబాటులో లేడని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో మరో ఆటగాడిని ఎంపిక చేయకుండా ప్రస్తుత జట్టునే కొనసాగించే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జనవరి 25 నుంచి ప్రారంభమయ్యే అయిదు టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు ఉప్పల్ వేదికగా జరగనుంది. విశాఖపట్నంలో జరగనున్న రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుంది. చివరి మూడు టెస్టులు రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల వేదికగా జరగనున్నాయి.

తొలి రెండు టెస్టులకు ఎంపికైన టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్

ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్

Story first published: Monday, January 22, 2024, 18:40 [IST]
Other articles published on Jan 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+