ఇంగ్లాండ్‌తో టెస్టు సిరిస్: టాప్ 5 బ్యాట్స్‌మెన్ వీరే
హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇంగ్లాండ్‌పై 2-0తో టీమిండియా ఆధిక్యాన్ని సాధించింది. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సత్తా చాటుతోంది. ఇక ఈ సిరిస్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో దూసుకుపోతున్నాడు.
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఈ సిరిస్‌లో ఇప్పటికే 405 పరుగులు సాధించాడు. కోహ్లీ ఫామ్‌ను అడ్డుకునేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు నానాతంటాలు పడుతున్నారు. రాజ్ కోట్, విశాఖపట్నం టెస్టుల్లో ఓ వైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ మాత్రం నిలకడగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ ఏడాది 10 టెస్టు మ్యాచ్‌లాడిన కోహ్లీ 68.92 యావరేజితో 965 పరుగులను సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో కోహ్లీ అనంతరం ఛటేశ్వర పుజారా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రెండో స్ధానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ మూడో స్ధానంలో ఉన్నాడు.
గత మూడు టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన టాప్ 5 ప్లేయర్లు వీరే:

విరాట్ కోహ్లీ
ఈ ఏడాది కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌లాడిన కోహ్లీ 405 పరుగులు చేశాడు. ఈ సిరిస్‌లో కోహ్లీ విశాఖపట్నంలో జరిగిన టెస్టులో అత్యధిక స్కోరు 167. అంతేకాదు తన అత్యుత్తమ ఫామ్‌తో ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ మూడో స్ధానంలో నిలిచాడు. ఈ సిరిస్‌లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలను కోహ్లీ సాధించాడు.

ఛటేశ్వర్ పుజారా
ఈ సిరిస్‌లో రెండో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఛటేశ్వర పుజారా నిలిచాడు. గత మూడు టెస్టుల్లో పుజారా 338 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్‌తో రాజ్ కోట్‌తో జరిగిన టెస్టులో పుజార్ 124 పరుగులతో రాణించాడు. రాజ్ కోట్ స్టేడియంలో పుజారా హోం గ్రౌండ్ కావడం విశేషం. ఆ తర్వాత విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో రెండో సెంచరీని సాధించాడు. ఇంగ్లాండ్ బౌలర్స్‌పై పుజారా మంచి ట్రాక్ రికార్డుని నెలకొల్పాడు. ఈ సిరిస్‌లో పుజారా యావరేజి 56.33గా ఉంది. ఇంగ్లాండ్‌పై పుజారా 5 టెస్టు సెంచరీలు చేయడం విశేషం.

జో రూట్
ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో ఫామ్‌లో ఉన్న ఆటగాడు జో రూట్. గత మూడు టెస్టుల్లో జో రూట్ 299 పరుగులు సాధించాడు. యావరేజి 49.83గా ఉంది. సెంచరీతో పాటు రెండు అర్ధ సెంచరీలను జో రూట్ నమోదు చేశాడు. భారత పర్యటనలో జో రూట్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అయితే రాబోయే రెండు టెస్టుల్లో అతడు పుంజుకునే అవకాశం ఉంది.

బెన్ స్టోక్స్
ప్రస్తుత సిరిస్‌లో ఇంగ్లాండ్ జట్టులో మంచి ఫామ్‌లో ఉన్న ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్. గత మూడు టెస్టుల్లో 267 పరుగులు సాధించాడు. ఈ సిరిస్‌లోనే అతడు తన క్రికెట్ కెరీర్‌లోనే అత్యధిక పరుగులు (128) సాధించాడు. బెన్ స్టోక్స్ యావరేజి 53.40గా ఉంది.

అలెస్టర్ కుక్
భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ ఉన్నారు. గత మూడు టెస్టుల్లో 41.00 యావరేజితో 246 పరుగులు సాధించాడు. తొలి టెస్టు జరిగిన రాజ్ కోట్‌లో అలెస్టర్ కుక్ 130 పరుగులతో సెంచరీ సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications