కటక్ చేరిన టీమిండియా: సంప్రదాయ స్వాగతం (వీడియో)
హైదరాబాద్: రెండో వన్డే కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బుధవారం కటక్ చేరుకుంది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే గురువారం (జనవరి 19)నాడు కటక్‌లో జరగనుంది. ఇందులో భాగంగా టీమిండియా బుధవారం కటక్ చేరుకుంది.
నిజానికి టీమిండియా సోమవారమే కటక్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే ఆటగాళ్లు బస చేసేందుకు కటక్‌లో హోటల్ గదులు అందుబాటులో లేకపోవడంతో బుధవారం వరకు పూణెలోనే టీమిండియా ఉండిపోయింది. ఇక కటక్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు హోటల్ సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
సంప్రదాయ పద్ధతిలో హారతి ఇచ్చి, బొట్టు పెట్టి సిబ్బంది ఆటగాళ్లను ఆహ్వానించారు. పూణె వన్డే విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీమిండియా ఆటగాళ్లు కటక్ చేరుకున్న సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలను అభిమానుల కోసం బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
థాంక్యూ పూణె
తొలి వన్డేలో అద్భుత విజయం అందించిన పూణెకు థాంక్స్. రెండో వన్డే కోసం కటక్ వెళుతున్నాం.
టీమిండియాకు సంప్రదాయ స్వాగతం
కటక్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు హోటల్ సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
కటక్‌లో అభిమానుల కోలాహాలం
రెండో వన్డే జరగనున్న కటక్‌లోని బారాబతి స్టేడియంలో అభిమానుల కోలాహాలం మొదలైంది.
మీడియాతో కేఎల్ రాహుల్
రెండో వన్డే ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడుతున్న టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications