ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక వన్డే.. మూడు మార్పులతో బరిలోకి భారత్! ఆ ఇద్దరు ఔట్! తుది జట్టు ఇదే!

పూణే: భారత్-ఇంగ్లండ్ మధ్య పుణె వేదికగా ఆదివారం నిర్ణయాత్మక వన్డే మ్యాచ్ జరగనుంది. మూడు వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమవగా.. ఆదివారం వన్డేతో సిరీస్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో భారత్ తుది జట్టులో మూడు మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. రెండో వన్డేలో ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. స్పిన్నర్ల పేలవ బౌలింగ్‌తోనే భారత్ ఓటమిపాలైంది. దాంతో రెండు మార్పులు స్పిన్ బౌలింగ్ విభాగంలో ఖాయం. ఇక తొలి వన్డేలో మిడిలార్డర్లో తేలిపోయిన ఇంగ్లిష్ జట్టు రెండో వన్డేలో ఆ తప్పులను సరిచేసుకుంది. విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి అద్భుత విజయాన్ని అందుకుని జోరుమీదుంది. దీంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

కుల్దీప్, కృనాల్ ఔట్:
ఫామ్‌లేమితో సతమతమవుతున్న కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లు వేసి 84 పరుగులు సమర్పించుకున్నాడు. కెరీర్‌లో రెండో మ్యాచ్ ఆడిన కృనాల్ పాండ్యా కేవలం 6 ఓవర్లలోనే 72 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇద్దరు స్పిన్నర్లు కలిపి 16 ఓవర్లు వేసి కనీసం ఒక వికెట్ తీయకుండా 156 పరుగులు ఇచ్చారు. స్పిన్నర్ల బౌలింగ్‌లో చితక్కొట్టిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ మరో ఆరు ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు. ఈ నేపథ్యంలోనే యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్‌లను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అవకాశం వస్తే సుందర్ బ్యాట్‌తోనూ రాణించగలడు. ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్, యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చివరి వన్డే ఆడనున్నారు. మరో పేసర్ శార్దుల్ ఠాకూర్‌కు విశ్రాంతినిచ్చి యార్కర్ స్పెషలిస్ట్ టీ నటరాజన్‌ను ఆడించే అవకాశం ఉంది.

రోహిత్, ధావన్ ఆదినుంచే విరుచుకుపడాలి:
భరత బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు జరిగే ఛాన్స్ లేదు. అయితే వ్యూహం మార్చాల్సిన అవసరం ఉంది. తొలి 15 ఓవర్లలో ఓపెనర్లు దంచికొట్టాల్సిన అవసరం ఏర్పడింది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కంఫర్ట్ జోన్ వదిలేసి.. ఆదినుంచే విరుచుకుపడాలి. ఇద్దరూ కలిసి అదిరే ఆరంభాలు ఇవ్వాలి. వరుసగా అర్ధ శతకాలు చేస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి అభిమానులు సెంచరీ ఆశిస్తున్నారు. కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌లోకి రావడం సంతోషకరం. రిషబ్ పంత్ ఆట ముగిసే వరకు క్రీజులో ఉండాలి. హార్దిక్ పాండ్యా నిలకడగా చెలరేగడం జట్టుకు అవసరం.

విధ్వంసకర ఫామ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు:
తొలి వన్డేలో తేలిపోయిన ఇంగ్లండ్ మిడిలార్డర్.. రెండో వన్డేలో తప్పులను సరిచేసుకుంది. విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. ఓపెనర్లు జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో విధ్వంసకర ఫామ్‌లో ఉన్నారు. తొలి 15 ఓవర్లు విరుచుకుపడి.. మిగతావారి పని తేలిక చేస్తున్నారు. బెన్ స్టోక్స్ ఫామ్‌లోకి రావడం వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇయాన్ మోర్గాన్ లేప్పటికీ లియామ్ లివింగ్‌స్టోన్ రెచ్చిపోగలడు. టీ20 నంబర్‌వన్ ఆటగాడు డేవిడ్ మలన్ ఉండనేఉన్నాడు. పరుగులు బాకీపడ్డ జోస్ బట్లర్ ఈసారి చెలరేగే ప్రమాదం ఉంది. ఇక బౌలింగ్ పరంగా ఇబ్బందేమీ లేదు. పేస్ విభాగం కట్టు దిట్టమైన బౌలింగ్తో కోహ్లీసేనను ఇబ్బంది పెడుతోంది. స్పిన్ విభాగం కూడా రాణిస్తోంది.

తుది జట్లు:
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధావన్, పంత్, రాహుల్, హార్దిక్, సుందర్, చహల్, భువనేశ్వర్, నటరాజన్, ప్రసిధ్.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), రాయ్, బెయిర్‌స్టో, మలాన్, స్టోక్స్, లివింగ్‌స్టోన్, మొయిన్, సామ్ కరన్, టామ్ కరన్, రషీద్, టోప్లీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications