న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరుణ్‌ నాయర్‌ అంటే మీకు ఇష్టం లేదు?: మేనేజ్‌మెంట్‌కు సన్నీ ఘాటు ప్రశ్న

By Nageshwara Rao
India vs England 2018 5 Test : Sunil Gavaskar Questions BCCI About Karan Nair
India vs England: Sunil Gavaskar questions Karun Nair’s ommission from India XI

హైదరాబాద్: తొలి టెస్టు నుంచి జట్టులోనే ఉన్నా.. తనను ఒక్క మ్యాచ్‌ కూడా ఎందుకు ఆడించలేదో భారత జట్టు మేనేజ్‌మెంట్‌ కరుణ్ నాయర్‌కు జవాబు చెప్పాలని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశ్నించాడు.

భారత టెస్టు జట్టులో తెలుగు క్రికెటర్..: ఎవరీ హనుమ విహారిభారత టెస్టు జట్టులో తెలుగు క్రికెటర్..: ఎవరీ హనుమ విహారి

ఐదు టెస్టు మ్యాచ్‌లో సిరిస్‌లో భాగంగా గురువారం నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ టెస్టులో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా స్థానంలో హనుమ విహారి అరంగేట్రం చేశాడు.

విహారికి ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇండియా త‌ర‌ఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 292వ ప్లేయ‌ర్ విహారి. జట్టులో క‌రుణ్ నాయ‌ర్ రూపంలో మ‌రో సీనియ‌ర్ బ్యాట్స్‌మ‌న్ ఉన్నా... అతడిని కాద‌ని విహారికి తుది జ‌ట్టులో చోటు కల్పించారు. అలానే నాలుగో టెస్టులో విఫలమైన స్పిన్నర్ అశ్విన్‌ని పక్కన పెట్టి రవీంద్ర జడేజాని తుది జట్టులోకి తీసుకున్నాడు.

చివరి టెస్టులో కరుణ్‌ నాయర్‌కు బదులు విహారిని తుది జట్టులోకి తీసుకున్న నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ "కరుణ్‌ నాయర్‌ మీకు ఇష్టమైన ఆటగాడు కాదు. తొలి టెస్టు నుంచి జట్టులోనే ఉన్నా.. తనను ఒక్క మ్యాచ్‌ కూడా ఎందుకు ఆడించలేదో అని జట్టు మేనేజ్‌మెంట్‌ను అడగడానికి అతనికి అన్నీ అర్హతలు ఉన్నాయి" అని అన్నాడు.

"ఇప్పటి వరకు అదనపు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌కు ఎంపిక చేయలేదు.. చివరి టెస్టులో చేశారు. అందుకే మేనేజ్‌మెంట్‌ అతనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంది" అని గవాస్కర్ అన్నాడు. భారత్ తరుపున టెస్టుల్లో సెహ్వాగ్‌ తర్వాత ట్రిపుల్‌ సెంచరీ చేసిన మరో క్రికెటర్ కరుణ్‌ నాయరే కావడం విశేషం.

India vs England 5th Test: జో రూట్ ఖాతాలో అనుకోని రికార్డుIndia vs England 5th Test: జో రూట్ ఖాతాలో అనుకోని రికార్డు

ఇప్పటికే టెస్టు సిరిస్‌ను 1-3తో సొంతం చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్‌ను నెగ్గి కుక్‌ను విజయంతో సాగనంపాలని భావిస్తోంది. మరోవైపు, చివరి టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

Story first published: Saturday, September 8, 2018, 15:44 [IST]
Other articles published on Sep 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X