Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: గుడ్డు పెట్టిన గిల్.. ఇక జట్టులో కనపడడు! (Video)

టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఫామ్ కోల్పోయిన గిల్ తిరిగి లయను అందుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ పరుగులు సాధించలేకపోతున్నాడు. తాజాగా ఎదుర్కొన్న రెండో బంతికే వికెట్‌ను చేజార్చుకుని డకౌట్‌గా వెనుదిరిగాడు.ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 23 పరుగులే సాధించి విమర్శలు ఎదుర్కొంటున్నాడు..

రెండు ఇన్నింగ్స్‌లు కలిపి గిల్ 68 బంతుల్ని ఎదుర్కొన్నాడు. కానీ సమర్థవంతంగా ఢిఫెండ్ లేడా షాట్‌లు ఆడిన బంతుల్ని చాలా తక్కువ. తొలి ఇన్నింగ్స్‌‌లో గిల్ 16 పరుగుల వద్ద లైఫ్ లభించింది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జో రూట్ బౌలింగ్‌లో క్రీజు బయటికి వచ్చి భారీషాట్‌కు యత్నించాడు. కానీ అది బ్యాట్‌కు సరిగా కనెక్ట్ కాలేదు. అయితే సూర్యుడి ఎఫెక్ట్‌తో బెన్ స్టోక్స్‌కు గాల్లో బంతి కనిపించలేదు.ఆ తర్వాత కూడా గిల్ జాగ్రత్తగా ఆడలేకపోయాడు.

India vs England: Shubman Gill failed once again in England test and gets trolls

వరుస వైఫల్యాలు గిల్‌ను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. యశస్వీ జైశ్వాల్ రాకతో వన్‌డౌన్‌లో వస్తున్న అతడు పరుగులు సాధించలేకపోతున్నాడు. గతేడాది మార్చిలో అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాపై సెంచరీ అనంతరం అతడు టెస్టు ఫార్మాట్‌లో లయను కోల్పోయాడు. ఆ తర్వాత 13, 18, 6, 10, 29*, 2, 26, 36, 10, 20,0 పరుగులతో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి. గిల్ తన స్థానాన్ని కోల్పోయాడని తిరిగి జట్టులో కనిపించడం కష్టమే అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు గిల్‌కు కష్టకాలంలో భరోసా ఇవ్వడానికి ఇతర ప్లేయర్లకు అన్యాయం చేస్తున్నారని సెలక్టర్లపై మండిపడుతున్నారు. ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్, పుజారా, రుతురాజ్ గైక్వాడ్ వంటి ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల గిల్‌ ఫామ్‌‌ గురించి కేఎల్ రాహుల్ స్పందిస్తూ.. వికెట్‌ను కాపాడుకునే పరిస్థితుల్లో గిల్ బ్యాటింగ్‌కు రావాల్సి వస్తుందని, అందుకే గిల్ జాగ్రత్తగా ఆడుతున్నాడని మద్దతుగా నిలిచాడు. కాగా, టామ్ హర్ట్లీ వేసిన బంతిని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించి గిల్ ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఉన్న పోప్ చేతికి చిక్కాడు.

Story first published: Sunday, January 28, 2024, 15:34 [IST]
Other articles published on Jan 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+