Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియా Vs ఇంగ్లాండ్: అండర్సన్‌ను చూసి నేర్చుకున్నా

India vs England 4 Test: Mohammed Shami Talks About James Anderson
India vs England: Shami says he is learning from Anderson

హైదరాబాద్: ఇంగ్లాండ్‌ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌ను చూసిన తాను చాలా విషయాలు నేర్చుకున్నానని భారత పేసర్ మహ్మద్ షమి చెప్పుకొచ్చాడు. సుదీర్ఘ పర్యటనలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం ఇంగ్లీషు గడ్డపై పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు సౌతాంప్టన్ వేదికగా ఆగస్టు 30(గురువారం) నుంచి ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో షమి మాట్లాడుతూ ఎక్కువ వేగం లేకున్నా అండర్సన్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే తీరు గొప్పగా ఉంటుందని చెప్పాడు.

"మన ముందే ఒక సీనియర్‌ బౌలర్‌ సత్తా చాటుతుంటే.. అతడిని చూసి చాలా నేర్చుకోవచ్చు. నేనూ అదే చేశా. అతను మరీ వేగంగా బంతులేయకున్నా ఎలా వికెట్లు తీస్తాడా అని చూసేవాడిని. అతను ఎలాంటి లెంగ్త్‌ల్లో బంతులేస్తున్నాడని గమనించేవాడిని" అని షమి అన్నాడు.

"పరిస్థితులకు తగ్గట్లుగా అతను భిన్నంగా బౌలింగ్‌ చేస్తాడు. మనం ఎక్కడి నుంచి వచ్చినా పర్వాలేదు. కానీ స్థానిక పరిస్థితుల్లో ఒక బౌలర్‌ ఎలా బౌలింగ్‌ చేస్తున్నాడో గమనించడం ముఖ్యం. అండర్సన్‌ను చూసి నేనెంతో నేర్చుకున్నా'' అని షమి అన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత్ 1-2తో వెనుకంజలో ఉంది.

Story first published: Wednesday, August 29, 2018, 13:20 [IST]
Other articles published on Aug 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+