Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువీని చేర్చమని కోహ్లీ అడిగాడా?: చీఫ్ సెలక్టర్ చెప్పిన సమాధానమిదే

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు వన్డేలు, టీ20ల సిరీస్‌‌లకు బీసీసీఐ బుధవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని ప్రకటించింది. టీమిండియా ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. బుధవారం పరిమతి ఓవర్ల కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకోవడంతో వన్డే, టీ20 కెప్టెన్‌గా కోహ్లీ వ్యవహరించనున్నాడు.

దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2013 డిసెంబర్‌లో చివరిసారిగా భారత జట్టు తరఫున యువరాజ్ సింగ్ వన్డే మ్యాచ్ ఆడాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు జట్టుుక దూరంగానే ఉన్నాడు.

Yuvraj Singh

భారత జట్టులోకి మళ్లీ వస్తానని, నీలం రంగు జెర్సీ ధరిస్తానని గతంలో యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అతడు అనుకున్నట్లే జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ మధ్య కాలంలో రంజీల్లో యువరాజ్ సింగ్ అద్భుతంగా ఆడటంతో పాటు డబుల్ సెంచరీని కూడా సాధించాడు.

ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్‌లో యువరాజ్ సింగ్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అతడిని జట్టులోకి తీసుకోవడం జరిగిందని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ జట్టును ప్రకటించే సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. అంతే కాకుండా ఒక డబుల్ సెంచరీతో పాటు 180 కూడా స్కోర్ చేసి చక్కని ఫామ్ కనబర్చాడని ఆయన గుర్తు చేశారు.

అందుకే యూవీకి రెండు ఫార్మెట్‌లలో అవకాశం ఇచ్చామని తెలిపారు. తామంతా సాధ్యమైనంత వరకు అత్యుత్తమ జట్టుని ఎంపిక చేశారమని, ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నామని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు.

ఇదిలా ఉంటే వన్డే, టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తాను తప్పుకొంటున్నట్లు ధోనీ ప్రకటించిన తర్వాత ఎంపిక చేసిన తొలిజట్టు ఇదే కావడం విశేషం. ముఖ్యంగా వన్డే, టీ20 జట్టులో యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు.

గతేడాదిగా టీమిండియాకు దూరమైన సురేష్‌ రైనాకు వన్డేల్లో చోటు దక్కలేదు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైనా అనారోగ్యం కారణంగా రైనా బరిలోకి దిగని విషయం తెలిసిందే.

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలకు భారత జట్టు:
వన్డే జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), మహేంద్ర సింగ్ ధోని (వికెట్‌ కీపర్‌), కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, యువరాజ్‌ సింగ్‌, అజింక్య రహానె, హార్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అమిత్‌ మిశ్రా, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌.

ఇంగ్లాండ్‌తో మూడు టీ20లకు భారత జట్టు:
టీ20 జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), మన్‌దీప్‌ సింగ్, కేఎల్‌ రాహుల్‌, యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, రిషబ్‌పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్‌, మనీశ్‌ పాండే, బుమ్రా, భువనేశ్వర్‌, ఆశిష్‌ నెహ్రా

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+