Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: మూడో వన్డేలో సంచల ఇన్నింగ్స్.. సామ్ కరన్ ప్రపంచ రికార్డ్!!

India vs England: Sam Curran equals world record for highest ODI score by a number 8 batsman

పూణే: పుణె వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన చివరి వన్డేలో భారత్ ఏడు పరుగుల తేడాతో గెలిచినా.. స్టార్ ఆల్‌రౌండర్‌ సామ్ కరన్ (95 నాటౌట్: 83 బంతుల్లో 9x4, 3x6) ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు చివరి బంతి వరకు పోరాడాడు. ఒక రకంగా చెప్పాలంటే మ్యాచ్‌లో ఓటమి తథ్యమనేలా కోహ్లీసేనని భయపెట్టాడు. ఛేదనలో ఇంగ్లండ్ ఒకానొక దశలో 168/6తో భారీ పరుగుల తేడాతో ఓడిపోయేలా కనిపించింది. అయితే కరన్ సంచల ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. కరన్ మాత్రం క్రీజులో నిలబడి వేగంగా పరుగులు చేశాడు.

ఎనిమిదో వికెట్‌కు ఆదిల్‌ రషీద్‌ (22 బంతుల్లో 19; 2 ఫోర్లు)తో 57 పరుగులు.. తొమ్మిదో వికెట్‌కు మార్క్‌ వుడ్‌ (21 బంతుల్లో 14; ఫోర్‌)తో 60 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ విజయం ఖాయమనేలా చేశాడు సామ్ కరన్. భారత్‌కు సునాయాసంగా దక్కాల్సిన విజయాన్ని తీవ్రంగా శ్రమించి మ్యాచ్‌ని చివరి బంతివరకు తీసుకెళ్లాడు. చివరి ఓవర్‌లో బట్లర్ సేన విజయానికి 14 పరుగులు అవసరంకాగా.. టీ నటరాజన్ వ్యూహాత్మక బౌలింగ్‌తో అతడ్ని కట్టడి చేశాడు. దాంతో ఆఖరికి ఇంగ్లండ్ 322/9కే పరిమితమైంది. కరన్ సెంచరీ చేసే అవకాశాన్ని కూడా కోల్పోయాడు.

8వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 95 పరుగులు చేయడం ద్వారా అరుదైన ప్రపంచ రికార్డ్‌లో సామ్ కరన్ నెం.1 స్థానంలో నిలిచాడు. వన్డేల్లో ఇప్పటి వరకూ 8 లేదా ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్ చేసి.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కరన్ అగ్రస్థానంలో నిలిచాడు. 2016లో ఇంగ్లండ్‌ పేసర్ క్రిస్‌ వోక్స్.. శ్రీలంకపై 95 పరుగులు చేశాడు. తక్కువ బంతుల్లోనే కరన్ అవే 95 పరుగులు చేయడంతో ఈ రికార్డ్‌లో టాప్‌లో నిలిచాడు. ఆండ్రీ రసెల్ 2011లో భారత్‌పై 92 పరుగులు చేయగా.. వెస్టిండీస్‌పై నాథన్ కౌల్టర్ నైల్ 92 పరుగులు చేశాడు. రవి రాంపాల్ 2011లో భారత్‌పై 86 పరుగులు చేశాడు.

మూడో వన్డేలో భారత్‌ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ధావన్‌ (67), పంత్‌ (78; 62 బంతుల్లో 5×4, 4×6), హార్దిక్‌ (64; 44 బంతుల్లో 5×4, 4×6) అర్ధ శతకాతో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లలో మార్క్‌వుడ్‌ (3/34), రషీద్‌ (2/81) రాణించారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులు చేసింది. చివరి వరకూ పోరాడిన సామ్‌ కరన్‌ (95 నాటౌట్‌; 83 బంతుల్లో 9×4, 3×6) భారత్‌ను భయపెట్టాడు. మలన్‌ (50; 50 బంతుల్లో 6×4) ఆకట్టుకున్నాడు. శార్దూల్‌ (4/67), భువనేశ్వర్‌ (3/42) సత్తాచాటారు.

Story first published: Monday, March 29, 2021, 13:24 [IST]
Other articles published on Mar 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+