For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ.. 15 నెలల తర్వాత!!

India vs England: Rohit Sharma hits century after 15 months in Chennai Test

చెన్నై: ఇంగ్లండ్‌తో చెపాక్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ సెంచరీ చేశాడు. వ‌న్డే త‌ర‌హాలో ఆడి 130 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. సెంచరీ ముందు కాస్త నెమ్మదిగా ఆడాడు కానీ లేదంటే ముందుగానే శతకం అందుకునేవాడు. స్పిన్నర్ మొయిన్ అలీ వేసిన 42వ ఓవర్‌ మూడో బంతికి రెండు పరుగులు తీసిన రోహిత్.. 15 నెలల తర్వాత సెంచరీ చేశాడు. చివరిగా 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేశాడు. టెస్టు కెరీర్‌లో రోహిత్‌కి ఇది ఏడో శతకం కాగా.. చెన్నైలోని చెపాక్ మైదానంలో సెంచరీ నమోదు చేయడం ఇదే తొలిసారి.

రహానే నమ్మకం నిలబెట్టాడు:

ఈ సెంచరీతో వైస్ కెప్టెన్ ఆజింక్య రహానే నమ్మకాన్ని రోహిత్ శర్మ నిలబెట్టాడు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో రహానే మాట్లాడుతూ.. రోహిత్ ఆటతీరును సమర్థించాడు. కేవలం 4-6 ఇన్నింగ్స్‌ చూసి ఆటగాడి సత్తాను అంచనా వేయడం సరైన చర్య కాదని, రోహిత్ మంచి ఆటగాడన్నాడు. రోహిత్ అద్భుతంగా ఆడగలడన్న నమ్మకం తనకుందని చెప్పుకొచ్చాడు. రహానే ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే రోహిత్ సెంచరీతో మెరవడం విశేషం. అది కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ధాటిగా ఆడి సెంచరీ సాధించడంతో అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా ఉంది.

స్వీప్, కట్ షాట్లతో ఆరగొట్టాడు:

స్వీప్, కట్ షాట్లతో ఆరగొట్టాడు:

రెండో టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్ శుభమన్ గిల్ (0: 3 బంతుల్లో) రెండో ఓవర్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన చతేశ్వర్ పుజారా (21: 58 బంతుల్లో 2x4)తో కలిసి రోహిత్ ని ఇన్నింగ్స్‌ను నడిపించాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో స్వీప్, కట్ షాట్లతో రోహిత్ అదరగొట్టేశాడు. ఇక ‌స్టోక్స్ బౌలింగ్‌లో ఫుల్ షాట్‌లు హైలైట్‌గా నిలిచాయి. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ బాదాడు.

రోహిత్ సెంచరీ:

అయితే స్పిన్నర్ జాక్ లీచ్.. పుజారాను ఔట్ చేశాడు. ఇక విరాట్ కోహ్లీ (0: 5 బంతుల్లో) ఆ తర్వాతి ఓవర్లోనే ఊహించ‌ని రీతిలో మొయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భార‌త్ 86 ప‌రుగుల‌కు మూడు వికెట్లు కోల్పోయింది. ఆపై రోహిత్, రహానే జాగ్రత్తగా ఆడుతూ స్కోరును 100 దాటించారు. లంచ్ స‌మ‌యానికి భార‌త్ మూడు వికెట్ల న‌ష్టానికి 106 ప‌రుగులు చేసింది. అనంతరం రహానే ధాటిగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపాడు. అయితే స్పిన్నర్ల బౌలింగ్‌లో గతి తప్పిన బంతుల్ని మాత్రమే హిట్ చేస్తూ వచ్చిన హిట్‌మ్యాన్.. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో మాత్రం స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించేశాడు. ఈ క్రమంలో సెంచరీ చేశాడు.

ఏడు సెంచరీలు భారత్ గడ్డపైనే:

ఏడు సెంచరీలు భారత్ గడ్డపైనే:

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో రోహిత్ శర్మకు ఇది 4వ సెంచరీ. 66కు పైగా సగటుతో 800 పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో రోహిత్ నమోదు చేసిన ఏడు సెంచరీలు భారత్ గడ్డపైనే కావడం గమనార్హం. ఇక ప్ర‌స్తుతం క్రీజులో రోహిత్ శర్మ (129), అజింక్య ర‌హానే (35) ఉన్నారు. భారత్ 51 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌల‌ర్స్ లో స్టోన్, లీచ్, అలీ చెరో వికెట్ తీసుకున్నారు.

India vs England: విరాట్ కోహ్లీ ఇలా ఔటవ్వడం ఇదే తొలిసారి.. రికార్డుల్లోకి మొయిన్ అలీ!!

Story first published: Saturday, February 13, 2021, 14:28 [IST]
Other articles published on Feb 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+