న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్.. సెంచరీని జంతువుకు అంకితమిచ్చాడు..!!

Rohit Sharma Dedicates Century To His 'Fallen Friend Sudan'
India vs England: Rohit Sharma Dedicates Century To His Fallen Friend Sudan

హైదరాబాద్: అప్పటిదాకా ఎదుర్కొంటున్న విమర్శలన్నింటినీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఒక్క సెంచరీతో తుడిచిపెట్టేశాడు రోహిత్ శర్మ. ఆదివారం ఇంగ్లాండ్‌తో తలపడిన టీమిండియా నిర్ణయాత్మక మ్యాచ్‌లో తీవ్రంగా శ్రమించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన మ్యాచ్ చివరి వరకూ క్రీజులో పాతుకుపోయి జట్టును నిలబడడు. ఇలా టీ20 సిరీస్‌ గెలుపుతో టీమిండియా సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటనలో మంచి శుభారంభం చేసింది.

సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో రోహిత్ సాధించిన సెంచరీని తనకు ఇష్టమైన సూడాన్‌కు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన తెల్లని ఖడ్గ మృగం సూడాన్‌ గత మార్చిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కెన్యాలోని ద్వార్ క్రలోవే జూలోని 45 ఏళ్ల ఖడ్గ మృగం మరణంపై ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో రోహిత్‌ శర్మ కూడా స్పందించాడు.

మ్యాచ్ జరిగిన తర్వాతి రోజు సోమవారం ట్విటర్‌లో ' నిన్నటి నా సెంచరీని చనిపోయిన నా ప్రియ నేస్తం సూడాన్‌కు అంకితమిస్తున్నాను. మనమంతా మంచి జీవనానికి ఓ మార్గం కనుగోవాలనేమో' అని ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఇది తెగ వైరల్‌ అయింది. ఈ అరుదైన రైనో మరణంపై ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ సైతం అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశాడు.

'మనమంతా సూడాన్‌ రక్షించడంలో విఫలమయ్యాం. జంతు ప్రేమికులారా ఇప్పటికైనా మేల్కొనండి, రైనోస్‌ అన్నిటిని రక్షిద్దాం.' అని పిలుపునిచ్చాడు. శతకంతో ​ఆకట్టుకున్న రోహిత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ లభించిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌ జూలై 12న ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, July 17, 2018, 16:36 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X