Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: టీమిండియాకు డబుల్ షాక్.. టి20ల తర్వాత వన్డే సిరీస్ కూడా అవుట్!

IND vs ENG: ఇటీవల ఆతిథ్య ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా.. తాజాగా వన్డే సిరీస్ కూడా కోల్పోయింది. వన్డే సిరీస్ ను ఇంగ్లాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచి ఇంగ్లాండ్ జట్టు వన్డే సిరీస్ ను తమ ఖాతాలో వేసుకుంది. ఈ చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. 50 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 387 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో 27 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించి సిరీస్ చేజిక్కించుకుంది.

రిటైర్ అవ్వడమే బెటర్: వరల్డ్ క్లాస్ స్పిన్నర్‌కు లార్డ్స్ వేదికగా తీరని అన్యాయం!

రిటైర్ అవ్వడమే బెటర్: వరల్డ్ క్లాస్ స్పిన్నర్‌కు లార్డ్స్ వేదికగా తీరని అన్యాయం!

రోహిత్ శర్మ సెంచరీ, గిల్, విరాట్ హాఫ్ సెంచరీలు వృథా
388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభమే లభించింది. భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలు అద్భుతంగా ఆడుతూ భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. శుభ్ మన్ గిల్ 84 బంతుల్లో 77 పరుగులు చేసి ఔట్ కాగా.. అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో కలిసి చెలరేగిపోయాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అడపాదడపా సిక్సులు, ఫోర్లు బాదుతూ అద్భుతమైన సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ శర్మ 110 బంతుల్లో 138 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ క్రీజులో ఉన్న సమయంలో విజయం భారత జట్టుదే అన్నంత ధీమా ఏర్పడింది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 74 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగతా బ్యాటర్లెవరూ రాణించకపోవడంతో భారత్ పరాజయం పాలైంది. మిగతా వారిలో ఇషాన్ కిషన్ 14, శ్రేయస్ అయ్యర్ 0, కేఎల్ రాహుల్ 12, అక్షర్ పటేల్ 2, గుర్నూర్ బ్రార్ 18, అర్ష్ దీప్ సింగ్ 15 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ 4 వికెట్లు పడగొట్టి టీమిండియా నడ్డి విరిచాడు. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జాకబ్ బెథెల్ తలో వికెట్ పడగొట్టారు

India vs England Rohit Sharma Century in Vain as England Beat India at Lords to Win ODI Series 2-1

దంచికొట్టిన ఇంగ్లాండ్ బ్యాటర్లు
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. వన్డేల్లో భారత్ పై ఇంగ్లాండ్ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. లార్డ్స్ స్టేడియంలో వన్డేల్లోనూ ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇంగ్లాండ్ బ్యాటర్లు టీమిండియా బౌలర్ల బౌలింగ్ ను ఊచకోత కోశారు. ఇంగ్లీష్ ఓపెనర్లు బెన్ డకెట్(141), జాకబ్ బెతెల్(91) దంచికొట్టారు. ఓపెనర్ డకెట్ 135 బంతుల్లో 141 పరుగులు చేయగా.. బెతెల్ 93 బంతుల్లో 91 పరుగులు చేసి ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన జో రూట్ 48 బంతుల్లో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో జోస్ బట్లర్ 13 బంతుల్లో 41 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 14 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ యాదవ్ ఓ వికెట్ తీశాడు.

టీమిండియా బౌలర్ సెంచరీ మిస్.. భారత క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు!

టీమిండియా బౌలర్ సెంచరీ మిస్.. భారత క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు!

ఘోరంగా దెబ్బతిన్న టీమిండియా బౌలర్లు
భారత్ తరఫున అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచిన గుర్నూర్ బ్రార్ తన 10 ఓవర్లలో 97 పరుగులు ఇచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్ వికెట్లేమీ తీయకపోగా..తన 10 ఓవర్లలో 72 పరుగులు ఇచ్చాడు. అక్షర్ పటేల్ కూడా తన 10 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ తన 10 ఓవర్లలో 69 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ప్రిన్స్ యాదవ్ తన 10 ఓవర్లలో 79 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు.

Story first published: Monday, July 20, 2026, 0:11 [IST]
Other articles published on Jul 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+