For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయిన భార‌త్‌!!

India vs England: Rohit Sharma, Ajinkya Rahane depart in quick succession

చెన్నై: చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కష్టాల్లో పడింది. కోహ్లీసేన స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. భారీ శ‌త‌కంతో చెల‌రేగిన‌ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ (161: 231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ఇంగ్లీష్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. భారీ షాట్‌కు యత్నించిన రోహిత్.. మొయిన్‌ అలీ చేతికి చిక్కాడు. దీంతో హిట్‌మ్యాన్ రోహిత్‌-అజింక్య రహానే 162 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆపై రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. 73వ ఓవర్లో రోహిత్ పెవిలియన్ చేరగా.. అనంతరం పంత్, రహానేలు రెండు ఓవర్ల పాటు ఆచితూచి ఆడారు.

ఇక స్పిన్నర్ మొయిన్ అలీ వేసిన 76వ ఓవ‌ర్లోనే అజింక్య రహానే (67: 149 బంతుల్లో 9 ఫోర్లు) బౌల్డ్ అయ్యాడు. దీంతో స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే రెండు కీల‌క వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది, మరోవైపు క్రీజులో కుదురుకున్న రోహిత్-రహానే జోడీ వెనుదిర‌గడంతో ఇంగ్లండ్ ఊపిరిపీల్చుకున్న‌ది. అయితే రిష‌బ్ పంత్‌, రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ జోడి 27 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 81 ఓవ‌ర్లు ముగిసేస‌రికి భార‌త్ 5 వికెట్ల న‌ష్టానికి 276 ప‌రుగులు చేసింది. పంత్ (14)‌, అశ్విన్ (13) క్రీజులో ఉన్నారు.

రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్లో చేసిన ఏడు శతకాలు సొంతగడ్డపైనే సాధించడం విశేషం. దీంతో అతడు టీమిండియా మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్‌ 6 శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌పై అన్ని ఫార్మాట్లలో సెంచరీలు బాదిన ఏకైక వీరుడిగా అవతరించాడు. రోహిత్ శతకం చేసిన వెంటనే చెపాక్‌ మార్మోగింది. అభిమానులు అరుపులు, కేకలతో సందడి చేశారు. ఇక డ్రెస్సింగ్‌ రూమ్‌లో కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, సహా సహచరులు నిలబడి ఉత్సాహపరిచారు. మరోవైపు రోహిత్ సతీమణి సతీమణి రితికా సజ్దె చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు.

గింగిరాలు తిరుగుతున్న బంతిని సాధికారికంగా ఎదుర్కొన్న రోహిత్ శర్మపై మాజీలు ప్రశంసలు కురిపించారు. 'రోహిత్‌ బాగా ఆడావు. సవాళ్లు విసిరే పరిస్థితుల్లో సంతృప్తికర సెంచరీ. కఠిన పిచ్‌పై బ్యాటింగ్‌లో నిర్ణయాత్మక ఫుట్‌వర్క్‌, సానుకూల తీవ్రత ప్రాముఖ్యం ప్రదర్శించావు' అని వీవీఎస్‌ లక్ష్మణ్‌ ట్వీట్ చేశాడు. 'రోహిత్ ‌శర్మ టాప్‌ క్లాస్‌. సొగసైన, అద్భుతమైన శతకం' అని హర్భజన్ ‌సింగ్‌ పేర్కొన్నాడు. సురేశ్‌ రైనా, సంజయ్‌ మంజ్రేకర్‌, ఆకాశ్‌ చోప్రా, మైకేల్‌ వాన్‌ కూడా పొగుడుతూ ట్వీట్ చేశారు.

Story first published: Saturday, February 13, 2021, 16:50 [IST]
Other articles published on Feb 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+