సెంచరీ ముందు క్రీజులో రోహిత్.. టెన్షన్‌తో రితికా ఏం చేసిందో తెలుసా? (వీడియో)

చెన్నై: చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా వెళుతోంది. తొలిరోజు ఆట ముగిసేసరికి కోహ్లీసేన 88 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 300 రన్స్ చేసింది. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ (161: 231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ సెంచరీతో మెరిశాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానే (67: 149 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకం చేశాడు. రిషభ్ పంత్ (33, 56 బంతుల్లో, 5×4, 1×6), అక్షర్ పటేల్ (5, 7 బంతుల్లో, 1×4) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, జాక్ లీచ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

సెంచరీ ముందు తడబడిన రోహిత్ :
ఇన్నింగ్స్ ఆరంభంలోనే యువ ఓపెనర్ శుభమన్ గిల్ డకౌట్ అయినా రోహిత్ శర్మ బ్యాట్ జులిపించాడు. చెన్నై పిచ్ బౌలర్లకు సహకరిస్తున్నా.. వన్డే తరహాలో దూకుడుగా ఆడి పరుగులు చేశాడు. ఫుల్ షాట్లు, కట్ షాట్లతో ఫ్రంట్ ఫుట్‌పైకి వచ్చి మరీ భారీ షాట్లతో అలరిస్తూ పరుగుల వరద పారించాడు. సహచరులు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో సునాయసంగా హాఫ్ సెంచరీ బాదాడు. అయితే పిచ్‌పై విపరీతంగా టర్న్ ఉండటం, మొయిన్ అలీ ప్రమాదకరంగా బంతులు వేయడంతో సెంచరీ ముందు హిట్‌మ్యాన్ కాస్త ఇబ్బంది పడ్డాడు. పరుగులు చేయడానికి తటపటాయించాడు.
టెన్షన్‌తో రితికా:
రోహిత్ శర్మ 97 పరుగుల వద్ద ఉండగా.. మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్ అద్భుత బంతులు వేశారు. ముఖ్యంగా అలీ వేసిన బంతులను ఆడడంలో ఇబ్బందిపడ్డాడు. స్వీప్ షాట్ ఆడే క్రమంలో ఫీల్డర్ల ముంగిట కొన్ని బంతులు గాల్లో లేచాయి. దాదాపుగా రోహిత్ ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీంతో చెపాక్ గ్యాలరీలో ఉన్న రోహిత్ సతీమణి రితికా సజ్దె కాస్త ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో ఆమె హృదయస్పందన ఒక్కసారిగా పెరిగినట్టుగా కనిపించారు. దీంతో ఫింగర్స్ క్రాస్ చేసి కూర్చొన్నారు. రోహిత్ సెంచరీ చేసేవరకు రితిక టెన్షన్‌తోనే ఉన్నారు. సెంచరీ బాదాక లేచి చప్పట్లతో అభినందించారు. ప్రస్తుతం రితికకు సంబందించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. బీసీసీఐ కూడా అభిమానుల కోసం ఓ వీడియో షేర్ చేసింది.

15 నెలల తర్వాత:
దాదాపు 15 నెలల తర్వాత రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రోహిత్ చివరి సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో రోహిత్ నమోదు చేసిన ఏడు సెంచరీలు భారత గడ్డపైనే రావడం విశేషం. రెండో టెస్టుకు ముందు ఆసీస్ పర్యటనలోనూ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆసీస్ గడ్డపై మూడు, నాలుగు టెస్టులు ఆడిన రోహిత్ వరుసగా 26,52, 44,7 పరుగులు సాధించాడు. అనంతరం ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులోనూ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 6,12 పరుగులు సాధించాడు. ఇప్పుడు శతకం బాది తానేంటో నిరూపించుకున్నాడు.
IPL 2021 auction: బీసీసీఐ కొత్త నిబంధన.. కింగ్స్ పంజాబ్‌కు భారీ షాక్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications