Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: బాబోయ్.. ఏంటీ ఈ స్టేడియం! మొతెరా బ్యూటీకి బోల్డ్ అవుతున్న క్రికెటర్లు!

India vs England: Rishabh Pant, Kevin Pietersen, Hardik Pandya in awe Of Motera Stadium
Ind Vs Eng 2021 : Cricket Fraternity In Awe Of Ahmedabad’s Motera Stadium || Oneindia Telugu

అహ్మ‌దాబాద్‌: దేశ క్రికెట్‌ అభిమానులకు సంతోషాన్నిచ్చే మరో తీపి కబురు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన మోతేరా స్టేడియం టెస్ట్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నది. మరో నాలుగు రోజుల్లో (24వ తేదీన) మోతేరాలో భారత్‌-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. నాలుగో టెస్ట్ కూడా మార్చి 3 నుంచి ఇదే స్టేడియంలో జరుగనున్నది. ఆ త‌ర్వాత 5 టీ20ల‌కు కూడా మొతెరానే వేదిక కానున్న‌ది. అయితే ప్ర‌పంచంలోనే అతిపెద్ద స్టేడియంగా ఇప్పుడు మొతెరా అంద‌ర్నీ అట్రాక్ట్ చేస్తున్న‌ది. కొత్త స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు వ‌చ్చిన క్రికెట‌ర్లు మైదాన అందాల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

బాబోయ్.. ఏంటీ ఈ స్టేడియం:

సుమారు ల‌క్షా ప‌ది వేల మంది ప్రేక్ష‌కుల సామ‌ర్థ్యం ఉన్న మొతెరా బ్యూటీకి ఇంగ్లండ్ క్రికెట‌ర్ల‌తో పాటు భార‌త క్రికెట‌ర్లు కూడా బోల్డ్ అవుతున్నారు. ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా కొత్త స్టేడియంలో దిగిన సెల్ఫీ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడు. 'ప్ర‌పంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో అనుభూతి అద్భుతంగా ఉంది' అని ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ మాజీ ప్లేయ‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ కూడా స్టేడియంపై కామెంట్ చేశారు. బాబోయ్.. ఏంటీ ఈ స్టేడియం అంటూ ఆశ్చర్యం వ్య‌క్తం చేశారు. 'మొతెరా స్టేడియం సూప‌ర్‌గా ఉంది. ఏ థియేట‌ర్ ఆఫ్ డ్రీమ్స్' అని కేపీ ట్వీట్ చేశాడు.

స్టోక్స్ ఆశ్చర్యం:

ఇంగ్లండ్ పేసర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ కూడా స్టేడియం గురించి ఓ ట్వీట్ చేశాడు. ల‌క్షా ప‌ది వేల సామ‌ర్థ్యం క‌లిగిన స్టేడియం అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ కూడా మొతెరా అందాల్ని మెచ్చుకున్నాడు. 'కొత్త స్టేడియంలో ఆడ‌డం ఆనందంగా ఉంది. ప్ర‌పంచ స్థాయి స‌దుపాయాలు ఇక్కడ ఉన్నాయి' అని పంత్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్ కూడా ఆశ్చర్యం వ్య‌క్తం చేశాడు. ప్లేయ‌ర్లు స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న వీయోను పోస్టు చేశాడు. క‌ల‌ర్‌ఫుల్‌గా ఉన్న మొతెరాలో.. ఇరు దేశాల ఆట‌గాళ్లు జోరుగా ప్రాక్టీసు చేస్తున్నారు.

ఎలాంటి అంతరాయాలు లేకుండా తిలకించవచ్చు:

క్రికెట్ స్టేడియంలో ప్రేక్షకులు ముందు వరుసలో కూర్చొని మ్యాచ్‌ చూసేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే మ్యాచ్‌ను ఆసాంతం ఎలాంటి అంతరాయాలు లేకుండా తిలకించవచ్చు. మోతేరా ప్రత్యేకత ఏమిటంటే.. స్టేడియం మధ్యలో ఒక్క స్తంభంగానీ, మరే ఇతర అడ్డంకులుగానీ లేవు. ఏ స్టాండ్‌లో కూర్చోని అయినా మ్యాచ్‌ను అడ్డంకులు లేకుండా ఆస్వాదించవచ్చు. మోతేరాలో 11 పిచ్‌లను నిర్మించారు. వీటిలోని ఐదింటిని ఎర్ర బంకమట్టి, నల్ల మట్టిని ఉపయోగించబడ్డాయి. మోతేరాలోని ప్రధాన మైదానంతో పాటు రెండు ప్రాక్టీస్ మైదానాలు కూడా ఉన్నాయి. ఈ రెండు ప్రాక్టీస్‌ మైదానాల్లో కూడా 9 చొప్పున పిచ్‌లు ఉన్నాయి. వీటిలో 5 పిచ్‌లు ఎర్రమట్టితో, 4 పిచ్‌లు నల్ల బంకమట్టితో తయారయ్యాయి.

రూ.700 కోట్ల ఖర్చు:

మోతేరా స్టేడియం పునరుద్ధరణ, ఆధునీకరణకు రూ.700 కోట్ల వరకు ఖర్చు అయిందట. స్టేడియం కాంప్లెక్స్ మొత్తం 63 ఎకరాల్లో ఉన్నది. ఒలింపిక్ సైజు స్టేడియం ఈత కొలను కూడా ఉంది. ఈ స్టేడియంలో 4 డ్రెస్సింగ్ రూములు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతి డ్రెస్సింగ్ రూంకు జిమ్నాసియంను జతచేశారు. స్టేడియంలో 6 ఇండోర్ పిచ్‌లు ఉన్నాయి. ఇక్కడ బౌలింగ్ యంత్రాల సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా బాక్సింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్ కోసం ప్రత్యేక కోర్టులు ఉన్నాయి. హాకీ, ఫుట్‌బాల్ మైదానాలు కూడా ఈ క్యాంపస్‌లో ఉన్నాయి.

ఎంసీజీ కంటే పెద్దది:

ఎంసీజీ కంటే పెద్దది:

ఇప్పటివరకు ఆస్ట్రేలియాకు చెందిన మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ) ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉండేది. మోతేరా స్టేడియంలో 1.10 లక్షల మంది కూర్చుని వీక్షించే సామర్థ్యం ఉన్నది. ఆస్ట్రేలియాకు చెందిన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ మిలియన్ ప్రేక్షకుల సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉన్నది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించేందుకు గుజరాత్‌ క్రికెట్‌ సంఘం పెద్దలు కృషి చేస్తున్నారు.

Story first published: Saturday, February 20, 2021, 14:50 [IST]
Other articles published on Feb 20, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+