న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: వైరల్ వీడియో.. నేలపై పాకుతున్న రిషబ్ పంత్!!

India vs England: Rishabh Pant does Spiderman Workout ahead Of 3rd Test in Motera Stadium
Ind Vs Eng : Rishabh Pant Does 'Spiderman' Workout || Oneindia Telugu

అహ్మదాబాద్: చెన్నైలో ఇంగ్లండ్‌పై రెండో టెస్టు గెలిచాక భారత ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన భారత్.. తర్వాతి టెస్టులో 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమానంగా నిలిచింది. అయితే మూడో టెస్టు ఈనెల 24న అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరగనుండటంతో ఇప్పటికే ఇరు జట్లూ అక్కడికి చేరుకొని ప్రాక్టీస్‌ మొదలెట్టాయి. ఈ సందర్భంగా వికెట్‌ కీపర్‌ రిషభ్ ‌పంత్‌ మరోసారి స్పైడర్‌మ్యాన్‌గా వార్తల్లో నిలిచాడు.

మూడో టెస్టుకు ముందు మొతేరా స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్న సందర్భంగా ‌రిషభ్ ‌పంత్‌ స్పైడర్‌మ్యాన్‌లా మారిపోయాడు. మిగతా ఆటగాళ్లు జిమ్‌లో శారీరక కసరత్తులు చేస్తుంటే.. పంత్‌ నేలపై పాకుతూ వెళ్లాడు. అది కూడా శారీరక కసరత్తులలో భాగమే. ఇందుకు సంబంధించిన వీడియోను యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. 'స్పైడర్‌మ్యాన్.. స్పైడర్‌మ్యాన్.. రిషభ్ ‌పంత్' అని కాప్షన్ ఇచ్చాడు. ఆ వీడియోకు స్పైడర్‌ మ్యాన్‌ థీమ్‌సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గా సెట్‌చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

రిషభ్ పంత్‌ ఇలా స్పైడర్‌మ్యాన్‌గా వార్తల్లోకెక్కడం ఇదేం తొలిసారి కాదు. గతనెల ఆస్ట్రేలియాతో తలపడిన బ్రిస్బేన్‌ టెస్టులోనూ నాలుగో రోజు మైదానంలోనే స్పైడర్‌మ్యాన్‌ హిందీ పాట పాడాడు. కీపింగ్‌ చేస్తున్నప్పుడు అతడు ఈ పాట పాడడంతో అది స్టంప్‌మైక్‌లో రికార్డు అయింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పుడు తాజాగా మరోసారి పంత్‌ స్పైడర్‌మ్యాన్‌లా చేయడం గమనార్హం. పంత్‌ బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. పింక్ బాల్ టెస్టులో వృద్ధిమాన్ సాహా విఫలమవడంతో రెండో టెస్ట్ నుంచి పంత్ ఆడాడు. 5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 97.

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ అరుదైన రికార్డు అందుకున్న విషయం తెలిసిందే. భారత్ తరఫున పంత్‌ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. అంతేకాదు టీమిండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లో (27) వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కన్నా పంత్ వేగంగా 1000 రన్స్ చేశాడు. పంత్ 27 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు చేయగా.. మహీ 32 ఇన్నింగ్స్‌లలో 1000 రన్స్ చేసి రెండో స్థానంలో ఉన్నాడు.

IPL 2021 Auction: మోరిస్‌ను అందుకే భారీ ధరకు తీసుకున్నాం.. అతడి పాత్రపై పూర్తి స్పష్టత ఉంది: సంగక్కరIPL 2021 Auction: మోరిస్‌ను అందుకే భారీ ధరకు తీసుకున్నాం.. అతడి పాత్రపై పూర్తి స్పష్టత ఉంది: సంగక్కర

Story first published: Saturday, February 20, 2021, 14:04 [IST]
Other articles published on Feb 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X