
నాటింగ్ హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ పలు అరుదైన రికార్డులు సాధించాడు. అరంగేట్రం టెస్టులోనే ఐదు క్యాచ్‌లు పట్టిన నాల్గో భారత వికెట్ కీపర్‌గా రిషబ్ ఘనత నమోదు చేశాడు. ఇంగ్లండ్ సీనియర్ ఓపెనర్ అలిస్టర్ కుక్ (29) క్యాచ్‌ని అందుకుని వికెట్ కీపర్‌గా ఘనమైన బోణి అందుకున్న రిషబ్ పంత్.. ఆ తర్వాత వరుసగా జెన్నింగ్స్ (20), పోప్ (10), క్రిస్‌వోక్స్ (8), ఆదిల్ రషీద్ (5) క్యాచ్‌లను అందుకున్నాడు.
ఫలితంగా అరంగేట్రంలో ఈ ఘనత సాధించిన నాల్గో భారత వికెట్ కీపర్‌గా గుర్తింపు సాధించాడు. అంతకుముందు టెస్టు అరంగేట్రంలో ఐదు క్యాచ్‌లు పట్టిన భారత కీపర‍్లలో తమ్‌హానే, కిరణ్ మోరే, నమాన్ ఓజాలు ఉన్నారు. మరొకవైపు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు పట్టిన తొలి భారత వికెట్ కీపర్‌గా రిషబ్ నిలిచాడు. ఇక ఒక ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు పట్టిన తొలి ఆసియన్ వికెట్ కీపర్‌గా, ఓవరాల్‌గా మూడో వికెట్ కీపర్‌గా రిషబ్ రికార్డులు సాధించాడు.
ఐదు క్యాచ్‌లు అందుకున్న ఐదుగురు భారత వికెట్ కీపర్లు:
తమానె వర్సెస్ పాకిస్తాన్, డాకా, 1955
కిరణ్ మోరె వర్సెస్ ఇంగ్లాండ్, లార్డ్స్, 1986
నామన్ ఓజా వర్సెస్ శ్రీలంక, కొలంబో ఎస్సెస్సీ, 2015
పంత్ వర్సెస్ ఇంగ్లాండ్ ట్రెంట్ బ్రిడ్జ్, 208
ఇంతే కాదు, పంత్ ఐదు క్యాచ్‌లు అందుకున్న తొలి ఆసియా వికెట్ కీపర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలోనే ఐధు క్యాచ్‌లు అందుకున్న మూడో వికెట్ కీపర్‌గానూ రికార్డులకెక్కాడు.
అరంగ్రేట మ్యాచ్‌లోనే ఐదు క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్లు:
బీ తాబేర్ వర్సెస్ దక్షిణాఫ్రికా, జోహన్నెస్ బర్గ్, 1966
జే మెక్ లీన్ వర్సెస్ బ్రిస్‌బేన్, 1978
రిషబ్ పంత్ వర్సెస్ ఇంగ్లాండ్, 2018
అన్నింటి కంటే ముఖ్యమైనది పంత్ తన టెస్టు క్రికెట్ కెరీర్‌ను సిక్సు బౌండరీతో మొదలుపెట్టాడు. ఇలా భారత క్రికెటర్ సాధించడం ఇదే మొదటిసారి. పంత్ సభ్యుడిగా ఉన్న భారత జట్టు మూడో టెస్టులో భారీ ఆధిక్యం 292 పరుగులతో దూసుకెళ్తోంది.