
అత్యుత్తమ ఫీల్డర్‌నే:
తాజాగా రవీంద్ర జడేజా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'నిజమే.. ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని. కానీ నేనిక్కడితోనే ఆగిపోను. నిరంతరం నా ఆట, ఫిట్‌నెస్‌పై శ్రమిస్తాను. ఇందుకోసం నేను విపరీతంగా భుజాల కసరత్తులు చేస్తాను. తరచూ పరుగెత్తుతాను. అలా కష్టపడతాను కాబట్టే ఫీల్డింగ్ బాగుంటుంది. విరాట్ కోహ్లీ మైదానంలో ఉత్సాహంగా ఉంటాడు. కోహ్లీ ఎంతో దృఢంగా, చైతన్యంతో ఉంటాడు. ఫిట్‌నెస్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాడు. అతడిని చూసే జట్టులో అందరూ తమ ఫిట్‌నెస్ ప్రమాణాలు పెంచుకున్నారు. ప్రతి ఒక్కరు శారీరకంగా శ్రమిస్తున్నారు కాబట్టే మైదానంలో ఇప్పుడు తేడా కనిపిస్తోంది' అని అన్నాడు.

ప్రపంచకప్ విజేతగా నిలుస్తాం:
ప్రపంచకప్ ముందు ఐపీఎల్ 20021 ఆడటం ఉపయోగకరమని రవీంద్ర జడేజా అభిప్రాయపడ్డాడు. 'ఇదో మంచి అవకాశం. టీ20 ప్రపంచకప్‌లో నా జట్టును గెలిపించేందుకు ఉపయోగపడుతుంది. అవకాశం దొరికిన ప్రతిసారీ వందశాతం గెలిపించేందుకే ప్రయత్నిస్తా. ప్రపంచకప్‌లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తా' అని చెప్పాడు. ఇంగ్లండ్‌పై భారత్ విజయం సాధించేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని జడ్డూ అంటున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్‌లో జట్టు అద్భుతంగా రాణిస్తుందన్నాడు. జట్టు సమతూకమూ పెరిగిందని జడేజా వెల్లడించాడు. వాతావరణం కలిసొస్తే కోహ్లీసేన విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశాడు.

3డీ ఆటగాడిగా సేవలు:
హార్దిక్ పాండ్యా జట్టులో ఉండడంతో రవీంద్ర జడేజాకు సరైన అవకాశాలు రాలేదు. ఎప్పుడైతే వెన్నెముక గాయంతో హార్దిక్ జట్టుకు దూరమయ్యాడో జడ్డూ కీలకంగా మారాడు. మూడు ఫార్మాట్లలో దుమ్మురేపుతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తనదైన ముద్ర వేశాడు. జడ్డూ కీలక సమయాల్లో వికెట్లు తీస్తాడు, లోయర్ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేస్తాడు. సరైన సమయంలో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టును ఆడుకుంటున్నాడు. 3డీ ఆటగాడిగా సేవలందిస్తున్నాడు. అందుకే కెప్టెన్ విరాట్ కోహ్లీ జడేజాను తుది జట్టులో ఉండేలా చూసుకుంటున్నాడు.

రాహుల్ హాఫ్ సెంచరీ:
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ రెండో సెషన్ పూర్తి చేసుకుంది. తొలి సెషన్‌లో 46/0తో నిలిచిన కోహ్లీసేన రెండో సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. 52 ఓవర్లకు 157/2తో పటిష్టస్థితిలో నిలిచింది. ఓపెనర్ రోహిత్ శర్మ (83; 145 బంతుల్లో 11x4, 1x6) ఔటైనా.. కేఎల్ రాహుల్ (55 నాటౌట్; 143 బంతుల్లో 3x4, 1x6) అర్ధ శతకంతో కొనసాగుతున్నాడు. టెస్ట్ స్పెసలిస్ట్ చెతేశ్వర్ పుజారా (9; 23 బంతుల్లో 1x4) మరోసారి నిరాశపరిచాడు. పుజారా అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా మరో వికెట్ పడకుండా భారత్ రెండో సెషన్ ముగించింది.


Click it and Unblock the Notifications
