ఇంగ్లీష్ గడ్డపై రెడ్ బాల్ ఛాలెంజ్‌కు సిద్ధం: అశ్విన్

హైదరాబాద్: సుదీర్ఘ సిరిస్ కోసం కోహ్లీసేన ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను మాత్రం పేలవ ప్రదర్శనతో 1-2తో చేజార్చుకుంది. ఇక, ఈ పర్యటనలో టీమిండియా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1 నుంచి కఠిన సవాల్ ఎదుర్కోనుంది.
ఈ నేపథ్యంలో ఆగస్టు మొదటి వారం నుంచి జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత్ ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ టెస్టు సిరిస్ కోసం భారత సెలక్టర్లు జట్టుని ప్రకటించగా.. అనూహ్యంగా అందులో అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లను సెలక్టర్లు ఎంపిక చేశారు.

టెస్టుల్లో అశ్విన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే
గతేడాది కాలంగా చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ అద్భుత ప్రదర్శనతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చోటు కోల్పోయిన అశ్విన్, జడేజాలు కనీసం టెస్టుల్లోనైనా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఈ పర్యటనలో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంది.

మొదటి మూడు టెస్టులకు ప్రకటించిన జట్టులో చోటు
తాజాగా మొదటి మూడు టెస్టులకు ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న అశ్విన్ మాట్లాడుతూ ఇంగ్లాండ్ పర్యటనపై తాను ఎంతో ఆతృతగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై మంచి అవగాహన ఉందని, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్ పిచ్‌లపై మంచి అవగాహన ఉంది
"భారత జట్టులో పోటీపెరిగిన నేపథ్యంలో.. నిరూపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు దొరకవు. నా వరకు.. ఇంగ్లాండ్ పిచ్‌లపై మంచి అవగాహన ఉంది. ఇక్కడ మ్యాచ్‌లు ఆడటాన్ని బాగా ఆస్వాదిస్తా. పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం.. మ్యాచ్ గమనానికి అనుగుణంగా బౌలింగ్ చేయడం ఇంగ్లాండ్‌లో కీలకం. టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా" అని అశ్విన్ అన్నాడు.

ఆగస్టు 1న బర్మింగ్ హామ్ వేదికగా తొలి టెస్టు
అశ్విన్ చివరగా ఆప్ఘనిస్థాన్‌తో బెంగళూరు వేదికగా జరిగిన ఏకైక టెస్టులో భారత్ తరుపున ఆడాడు. ఇప్పటివరకు 58 టెస్టు మ్యాచ్‌లాడిన రవిచంద్రన్ అశ్విన్ 316 వికెట్లు తీశాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఆగస్టు 1న బర్మింగ్ హామ్ వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications