ఓవల్ వేదికగా 5వ టెస్టు: రాహుల్‌పై వేటు, ఓపెనర్‌గా పృథ్వీ షాకి చోటు?

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో శుక్రవారం నుంచి ఆరంభమయ్యే ఐదో టెస్టులో టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. ఇంగ్లీషు గడ్డపై జరుగుతున్న టెస్టు సిరిస్ ఆరంభం నుంచీ భారత ఓపెనర్లు వరుసగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఓపెనింగ్ జోడీగా సీనియర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్‌తో పాటు కేఎల్ రాహుల్‌ని కూడా జట్టు మేనేజ్‌మెంట్ పరీక్షించింది. అయితే, ఓపెనింగ్ స్లాట్‌లో ఈ ముగ్గురూ పూర్తిగా విఫలమయ్యారు. ఈ సిరిస్‌లో ఇప్పటివరకు భారత్ ఓపెనర్ల ఆటతీరుని ఓసారి పరిశీలిస్తే అదే విషయం స్పష్టమవుతుంది.

మూడు టెస్టులాడిన శిఖర్ ధావన్
ఇప్పటి వరకు మూడు టెస్టులాడిన శిఖర్ ధావన్.. ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి చేసిన పరుగులు 158. ఇందులో ధావన్ అత్యధిక స్కోరు 44. ఇక కేఎల్ రాహుల్ కూడా మూడు టెస్టుల్లో చేసిన పరుగులు 96కాగా.. అత్యధిక స్కోరు 36గా ఉంది. మరో ఓపెనర్ మురళీ విజయ్ ఆడిన రెండు టెస్టుల్లో చేసిన పరుగులు 26కాగా.. అత్యధిక స్కోరు 20.

ముగ్గురు ఓపెనర్లు ఈ సిరిస్‌లో ఘోరంగా విఫలం
ఇలా, ఈ ముగ్గురు ఓపెనర్లు ఈ సిరిస్‌లో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే ఆఖరి టెస్టులో రాహుల్ స్థానంలో పృథ్వీ షాకు చోటుదక్కే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు చివరి టెస్టులో యువ ఓపెనర్ పృధ్వీ షాతో ఒక ప్రయోగం చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందట.

పృధ్వీ షాకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది?
ఇప్పటికే సిరీస్ 1-3తో చేజారిన నేపథ్యంలో.. నామమాత్రమైన ఈ టెస్టుకి పృధ్వీ షాకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? అనేదానిపై జట్టులో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆఖరి టెస్టులో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో జడేజా బరిలోకి దిగే అవకాశం ఉంది. తుంటి గాయం కారణంగా మూడో టెస్టులో అశ్విన్ ఇబ్బందిపడ్డాడు.
శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు
అయితే, సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు నాటికి కోలుకోవడంతో అతడికి తుది జట్టులో కల్పించారు. అయినా, నాలుగో టెస్టులో అశ్విన్ తన బౌలింగ్‌తో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications