Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తెలియదు: 'అశ్విన్‌ నుంచి చాలా నేర్చుకుందామనుకున్నా'

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరిస్‌కు టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్దానంలో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పర్వేజ్ రసూల్ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే అతడు స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో ఎంపికయ్యానని తెలియదని చెప్పడం గమనార్హం.

తనకు జట్టులో చోటు దక్కిందని తెలియగానే అశ్విన్ నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చని అనుకున్నాడట. 'అశ్విన్‌కు విశ్రాంతినిచ్చిన సంగతి నాకు తెలియదు. బీసీసీఐ ఆఫీస్ నుంచి నాకు ఫోన్‌ రాగానే అశ్విన్‌తో ఏడు రోజుల పాటు డ్రెస్సింగ్‌ రూమ్ పంచుకునే అవకాశం దక్కుతోందని, అతడి నుంచి చాలా నేర్చుకోవచ్చని అనుకున్నా'' అని టీ20 జట్టులో చోటు దక్కించుకున్న అనంతరం పీటీఐతో చెప్పాడు.

జమ్మూ కాశ్మీర్‌ జట్టుతో ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్

జమ్మూ కాశ్మీర్‌ జట్టుతో ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్

'సయ్యత్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా జమ్మూ కాశ్మీర్‌ జట్టుతో ట్రైనింగ్‌లో ఉన్నా. బీసీసీఐ ఆఫీసు నుంచి ఉదయం నాకు ఫోన్ రాగానే హడావుడిగా ఢిల్లీకి ప్లయిట్ పట్టుకుని బయల్దేరా' అని చెప్పుకొచ్చాడు. 2014 జూన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా రసూల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ గేమ్‌లో సత్తా చాటాడు

ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ గేమ్‌లో సత్తా చాటాడు

తన అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసుకున్న రసూల్‌కు బీసీసీఐ సెలక్టర్ల నుంచి సుదీర్ఘ విరామం పిలుపొచ్చింది. ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ గేమ్‌లో ఇండియా-ఏ జట్టులో అడిన రసూల్ 38 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా రసూల్ నిలకడగా రాణించడం వల్లే సెలక్టర్లు నుంచి అతడికి పిలుపొచ్చిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి

రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి

ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌‌కు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చి, వారి స్థానాల్లో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఆఫ్ స్పిన్నర్ పర్వేజ్ రసూల్‌ను ఎంపిక చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ మార్పులు చేసిందని బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

 ఇక ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరిస్‌లో చోటు

ఇక ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరిస్‌లో చోటు

లభించడంపై రసూల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే నుంచి విలువైన సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఈ సిరిస్ తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు రసూల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+