
మంచి స్కోర్ సాధిస్తే:
'నాలుగో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోర్ సాధించడం ఒక్కటే మార్గం. గడిచిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో రూట్ సేన 200 స్కోర్ దాటలేదు. పింక్ బాల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసి ఉంటే.. ఆ మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేది. తొలి టెస్టులాగే చివరి మ్యాచులో కూడా ఇంగ్లండ్ తొలుత భారీ స్కోర్ చేసి తర్వాత ఇద్దరు స్పిన్నర్లను బరిలోకి దించితే భారత్ ఒత్తిడికి గురవుతుంది. ఈ సిరీస్‌లో జో రూట్‌కు ఇంకా నమ్మకముంది. ఇంగ్లండ్ తమ బ్యాటింగ్ టెంపోను తిరిగి సొంతం చేసుకోవాలి. క్రీజులో ఫుట్‌వర్క్‌ను మెరుగుపర్చుకోవాలి' అని నాసర్ హుసేన్ సూచించాడు.

పీటర్సన్ కూడా:
ఆఖరి టెస్ట్‌లో ఇండియాను ఓడించి సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశం ఇంగ్లండ్‌కు ఉందని ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. 'నాలుగో మ్యాచ్‌లో పిచ్ ఫ్లాట్‌గా ఉంటుందని నేను అనుకోవడం లేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బాగా బ్యాటింగ్ చేస్తే.. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చుకొనే అవకాశం ఉంది. భారత్‌లో వైఫల్యానికి ఇంగ్లండ్ యువ బ్యాట్స్‌మెన్‌ను నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికిది తొలి పర్యటన. ఓడిపోయిన మ్యాచ్‌ల గురించి ఆందోళన చెందకుండా.. తర్వాతి మ్యాచ్‌లో విజయం సాధించడంపై ప్రశాంతంగా ఆలోచించాలి. ఇంతకన్నా బాగా ఆడాలేనా?, మెరుగవ్వాలంటే ఇంకేం చేయాలనే విషయాలపై దృష్టిసారించాలని చర్చించుకోవాలని' అని పీటర్సన్ అన్నాడు.

నాలుగో టెస్టుపై సర్వత్రా ఆసక్తి:
చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 277 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యాక.. రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. ఆపై పింక్‌బాల్ టెస్టులోనూ పది వికెట్లతో ఘన విజయం సాధించి పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. దీంతో నాలుగో టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్ ఈ మ్యాచ్ గెలిచినా, డ్రా చేసుకున్నా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుతుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియా టైటిల్ ఫైట్‌కు అర్హత సాధిస్తుంది.

పలు మార్పులతో:
మొతెరా మైదానంలో జరగనున్న చివరి టెస్ట్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లలో ఇరు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లీ, జో రూట్ పలు మార్పులు చేశారు. చివరి టెస్ట్‌లో కోహ్లీ.. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మొహ్మద్ సిరాజ్‌ని తీసుకున్నాడు. మరోవైపు స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్ స్థానాలలో డాన్ లారెన్స్ , డోమ్ బెస్‌లని రూట్ ఎంచుకున్నాడు


Click it and Unblock the Notifications












