Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో టీ20: టీమిండియా ప్రాక్టీస్ వీడియో, స్టేడియం వ్యూ ఇదీ

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టీ20 నాగ్‌పూర్‌లో (జనవరి 29) ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోని బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

మూడు టీ20 సిరిస్‌లో భారత్‌పై 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో నిలిచింది. దీంతో నాగ్‌పూర్ టీ20 టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండో టీ20లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కోహ్లీసేన ఉంటే, ఇయాన్ మోర్గానే నేతృత్వంలోని ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరిస్‌ను కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది.

India Vs England Nagpur 2nd T20 Tickets 29th January 2017

కాగా, ఆదివారం నాగ్‌పూర్ వేదికగా జరగనున్న రెండో టీ20కి సంబంధించిన టిక్కెట్లన్నీ కూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ అభిమానులు వాటిని సొంతం చేసుకునేందుకు ఎగబడ్డారని విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) వర్గాలు తెలిపాయి.

రెండో టీ20కి మంచు ప్రభావం ఉన్నా పెద్దగా ఇబ్బందిలేదని అసోసియేషన్ అధికారులు తెలిపారు. రెండో టీ20కి బీసీసీఐ మాజీ చీఫ్, ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ హాజరవుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఇది పదో అంతర్జాతీయ టీ20 మ్యాచ్. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ప్రిలిమినరీ మ్యాచ్‌ల్లో చాలా వరకు ఇక్కడే జరగడం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+