
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన సర్దార్ పటేల్ (మొతేరా) స్టేడియంను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంను బుధవారం వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రపతి ప్రారరంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, బీసీసీఐ సెక్రటరీ జై షా పాల్గొన్నారు. ఈ కొత్త స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియం అని పేరు పెట్టడం గమనార్హం.
లక్షా పది వేల సీటింగ్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా నరేంద్ర మోదీ (మొతేరా) రూపుదిద్దుకుంది. ఈ మైదానంలో తొలి మ్యాచ్‌కు సర్వం సిద్ధం చేశారు. భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టు మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది. భారీ స్టేడియం.. పైగా డే/నైట్‌లో, గులాబి బంతితో మ్యాచ్ జరగబోతుండటం క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. లక్షా 10 వేల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం మొతేరాకు ఉన్నా.. కరోనా కారణంగా సగం మందికే అనుమతి ఉంది.