For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌కు ఎదురు దెబ్బ: వన్డే, టీ20లకు షమీ దూరం

గాయం కారణంగా టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఇంగ్లాండ్‌తో వచ్చే ఏడాది జరగనున్న వన్డే, టీ20 సిరిస్‌కు దూరమయ్యాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: గాయం కారణంగా టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఇంగ్లాండ్‌తో వచ్చే ఏడాది జరగనున్న వన్డే, టీ20 సిరిస్‌కు దూరమయ్యాడు. ఇంగ్లాండ్‌తో ముగిసిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో కుడి మోకాలు గాయం కారణంగా టెస్టు సిరిస్ నుంచి షమీ తప్పుకున్నాడు.

26 ఏళ్ల షమీ గాయం నుంచి కోలుకోక పోవడంతో మరో నెలరోజుల పాటు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన తర్వాత షమీ తరచూ గాయల బారిన పడుతుండటం మనం చూస్తున్నాం. చివరిసారిగా షమీ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఆడాడు.

2015 వరల్డ్ కప్‌లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో షమీ ఆడాడు. వరుసగా ఆరు విజయాల అనంతరం భారత్ ఈ మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. కాగా, షమీ స్ధానంలో పేసర్ ఇషాంత్ శర్మకు చోటు లభించదని వార్తలు వస్తున్నాయి.

India Vs England: Mohammed Shami to miss ODI, T20I series due to injury

అయితే వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా పేరు కూడా వినిపిస్తోంది. 2016లో నెహ్రా కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరిస్‌కు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో పలువురు టీమిండియా ఆటగాళ్లు గాయాల బారిన పడిన సంగతి తెలిసిందే.

ఇక టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా వన్డే, టీ20 సిరిస్‌ను మిస్ అవుతున్నాడు. అయితే మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తిరిగి జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. చెన్నై టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్ కూడా 15 మంది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గాయం కారణంగా రోహిత్ శర్మ టెస్టు సిరీస్కు దూరమైన కారణంగా కరుణ్ నాయర్‌కు అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.

గాయం నుంచి కోలుకుంటున్న అజింక్యా రహానే, శిఖర్ ధవన్లు ఇంగ్లండ్‌తో తదుపరి సిరీస్లలో ఆడే అవకాశం కనబడుతోంది. జనవరి 15 నుంచి పూణె వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే సిరిస్ ప్రారంభం కానుంది. భారత పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్‌తో భారత్ 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 0-4తో ఇంగ్లాండ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

టెస్టు సిరిస్ అనంతరం క్రిస్టమస్, న్యూఇయర్ కోసం ఇంగ్లాండ్ జట్టు స్వదేశానికి వెళ్లింది. తిరిగి మళ్లీ వచ్చే ఏడాది భారత్‌ పర్యటనకు రానుంది. జనవరి 15 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరిస్‌కు రెండు నెలల విరామం తర్వాత మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

వన్డే షెడ్యూల్‌

1st ODI: 15 January at Maharashtra Cricket Association Stadium, Pune.

2nd ODI: 19 January at Barabati Stadium, Cuttack.

3rd ODI: 22 January at Eden Gardens, Kolkata.

టీ2 0షెడ్యూల్‌

1st T20I: 26 January at Green Park, Kanpur.

2nd T20I: 29 January at Vidarbha Cricket Association Stadium, Jamtha, Nagpur.

3rd T20I: 1 February at M Chinnaswamy Stadium, Bengaluru.

అన్ని మ్యాచ్‌లు కూడా స్టార్ స్పోర్ట్స్ ప్రసారం అవుతాయి. వన్డేలన్నీ కూడా డే/నైట్ జరుగుతాయి. టీ20 మ్యాచ్‌లు సాయంత్రం 7 గంటల తర్వాత జరుగుతాయి.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+