Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిటైర్ అవ్వడమే బెటర్: వరల్డ్ క్లాస్ స్పిన్నర్‌కు లార్డ్స్ వేదికగా తీరని అన్యాయం!

IND vs ENG: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన చివరి వన్డేకు దూరమయ్యాడు. అయినప్పటికీ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కారణంగా కుల్దీప్ యాదవ్‌కు జట్టులో చోటు దక్కలేదు. గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడలేదు. భారత జట్టు అనుభవం లేని పేస్ బౌలింగ్ విభాగాన్ని బరిలోకి దించింది.

టీమిండియా బౌలర్ సెంచరీ మిస్.. భారత క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు!

టీమిండియా బౌలర్ సెంచరీ మిస్.. భారత క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు!

ఈ నిర్ణయంతో మాజీ క్రికెటర్ ఆగ్రహం
జట్టు నుంచి కుల్దీప్ యాదవ్ ను పక్కన పెట్టడాన్ని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశ్నించారు.తుది జట్టుకు ఎక్కువ కారం దూరంగా ఉంచటం కుల్దీప్ యాదవ్ ఆత్మవిశ్వాసాన్ని, ఫామ్‌ను దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. జట్టు యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా కుల్దీప్ యాదవ్ కు రిటైర్ అవ్వమని కూడా సలహా ఇచ్చారు.

India vs England Mohammad Kaif Asks Kuldeep Yadav to Retire After Lords ODI Selection Humiliation

మహమ్మద్ కైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చాడు. "కుల్దీప్ యాదవ్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడం గురించి ఆలోచించాలి. ఈరోజు జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి లేకపోయినా, కుల్దీప్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. లార్డ్స్‌లో భారత బౌలింగ్ ఏకరీతిగా, వైవిధ్యం లేకుండా సాగింది. ఓ ఎడమచేతి మణికట్టు స్పిన్నర్ ఉండి ఉంటే బాగుండేది. గుర్తుంచుకోండి.. కుల్దీప్ యాదవ్ 118 వన్డేలలో 194 వికెట్లు తీశాడు. ఈ గణాంకాలకు ఏమాత్రం ప్రాముఖ్యత లేనట్లుంది." అని కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

IND vs ENG: దంచికొట్టిన ఇంగ్లీష్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం

IND vs ENG: దంచికొట్టిన ఇంగ్లీష్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం

387 పరుగులు చేసిన ఇంగ్లాండ్
టీమిండియా పేసర్లు చాలా దారుణంగా విఫలమయ్యారు. అక్షర్ పటేల్ 10 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చాడు. నలుగురు ఫాస్ట్ బౌలర్లు 40 ఓవర్లలో 317 పరుగులు సమర్పించుకున్నారు. గుర్నూర్ బ్రార్ 97 పరుగులు ఇచ్చాడు. విదేశాల్లో ఓ భారత బౌలర్ వేసిన అత్యంత ఖరీదైన వన్డే స్పెల్ ఇదే. ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు ఇచ్చింది, అందులో 9 పరుగులు లెగ్ బైస్ రూపంలో వచ్చాయి.

Story first published: Sunday, July 19, 2026, 22:44 [IST]
Other articles published on Jul 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+