'ఏదైనా చేయడానికి టీమిండియాకు ఐసీసీ అనుమతిస్తుంది.. అదే టెస్టు క్రికెట్‌కు నష్టం జరుగుతోంది'

లండన్: గుజ‌రాత్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన డేనైట్ టెస్ట్ మ్యాచ్ కేవ‌లం రెండు రోజుల్లోపే ముగిసిన విష‌యం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ చెలరేగడంతో 10 వికెట్ల తేడాతో భారత్ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే టీమిండియా టెస్ట్ సిరీస్‌లో ఆధిక్యం సాధించింద‌న్న ఆనంద‌మే ఉన్నా.. మ్యాచ్ మ‌రీ రెండు రోజుల్లోపే ముగియ‌డం ప‌ట్ల కొంత మంది మాజీలు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. మైఖేల్ వాన్, డేవిడ్ లాయిడ్, అలిస్టర్ కుక్, కెవిన్ పీటర్సన్ లాంటి ఇంగ్లండ్ మాజీలు మొతేరా పిచ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.

టీమిండియాకు ఐసీసీ మద్దతు

టీమిండియాకు ఐసీసీ మద్దతు

మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడంపై మైఖేల్‌ వాన్‌ మొదటి నుంచీ విమర్శలు చేస్తున్నాడు. తాజాగా మరోసారి మొతేరా పిచ్‌పై మండిపడ్డాడు. అంతేకాదు ఐసీసీని కూడా వదలలేదు. 'ఏదైనా చేయడానికి టీమిండియాకు ఐసీసీ అనుమతిస్తుంది. దాంతో అంతిమంగా టెస్టు క్రికెట్‌కు నష్టం జరుగుతోంది. తొలి టెస్టు తర్వాత 1-0 తేడాతో వెనుకబడ్డాక.. మిగతా టెస్టులకు తొలి బంతి నుంచే పిచ్‌ స్పందించేలా రూపొందించారు. ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ క్రమంలోనే భారత్ మూడో టెస్టులో విజయం సాధించింది. అది నిస్సారమైన గెలుపని నేను అనుకుంటున్నాను. ఇందులో ఏ జట్టూ విజయం సాధించలేదు' అని పేర్కొన్నాడు.

 ఇంగ్లండ్ కన్నా బాగా ఆడింది

ఇంగ్లండ్ కన్నా బాగా ఆడింది

'స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై కోహ్లీసేన కచ్చితంగా మంచి ప్రదర్శన చేసిందనే చెప్పాలి. ఇంగ్లండ్ కన్నా బాగా ఆడింది. ఈ విషయం ఒప్పుకోక తప్పదు. కానీ ఆటలో మంచి విషయాన్నే గ్రహించాలి. మాజీ ఆటగాళ్లుగా ఆ బాధ్యత మాపై ఉంది' అని కామెంటేటర్ మైఖేల్‌ వాన్‌ అన్నాడు. మూడో టెస్ట్ విజయంతో టీమిండియా సిరీస్‌లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. మొదటి టెస్ట్ ఇంగ్లండ్ గెలవగా.. రెండు, మూడు టెస్టుల్లో కోహ్లీసేన జయభేరి మోగించింది. మార్చి 4 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఇది ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్.

ఆ పాయింట్లను తొలగించాలి

ఆ పాయింట్లను తొలగించాలి

'భారత్ సిరీస్‌ ద్వారా ఇంగ్లండ్ ఆటగాళ్లు కొంతమంది తమ కెరీర్లకు పునాదులు వేసుకోవాలని చూస్తున్నారు. గత రెండు టెస్టుల పిచ్‌లు చూస్తుంటే.. ఆయా క్రికెటర్లు నిరుత్సాహానికి గురయ్యారు. ఒక బ్యాట్స్‌మన్‌గా తొలి ఇన్నింగ్స్‌లో అదృష్టం కొద్ది పరుగులు సాధించే విధంగా పరిస్థితుల్ని కల్పించుకోవడం టెస్టు క్రికెట్‌ కాదు. ఇలాంటి పిచ్‌లతో టెస్టు ఛాంపియన్‌షిప్‌కు పోటీపడితే ఆ పాయింట్లను తొలగించాలి' అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్‌ వాన్‌ సూచించాడు. ఇంగ్లండ్ ఆటగాళ్ల రొటేషన్‌ పద్ధితిని కూడా వాన్‌ తప్పుబట్టాడు. రొటేషన్‌ పాలసీలో భాగంగా స్టార్ ఆటగాళ్లను ఈసీబీ పక్కన పెడుతోన్న విషయం తెలిసిందే.

తెరవెనుక చర్చించుకుంటాం

తెరవెనుక చర్చించుకుంటాం

పిచ్‌పై ఫిర్యాదు చేసే విషయంలో మేం తెరవెనుక చర్చించుకుంటామని ఇంగ్లండ్ కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ పేర్కొన్నాడు.అయితే పింక్‌బాల్‌ టెస్టులో తమకన్నా భారత్ బాగా ఆడిందని, ఆ విషయాన్ని అంగీకరించాలని ఆయన స్పష్టం చేశాడు. ఇక మ్యాచ్‌ పూర్తయ్యాక ఇంగ్లండ్ కెప్టెన్‌ జో రూట్‌ మాట్లాడుతూ.. పిచ్‌ను తప్పుబట్టడం సరికాదని, ఆట త్వరగా పూర్తవ్వడానికి పింక్‌ ఎస్జీ బంతే కారణమన్నాడు.

India vs England: టీమిండియాకు భారీ షాక్.. నాలుగో టెస్ట్ నుంచి స్టార్ పేసర్ ఔట్‌!! ఎందుకో తెలుసా?

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, February 27, 2021, 15:52 [IST]
Other articles published on Feb 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X