
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. 338 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. భారత జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ 109 బంతుల్లో 102(15 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... విరాట్ కోహ్లీ 76 బంతుల్లో 66(7 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఇంగ్లాండ్ బౌలర్లలో లియాం ప్లెంకెట్ మూడు వికెట్లు తీయగా... క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీశాడు. తాజా విజయంతో ఇంగ్లాండ్ తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో గెలిస్తే ఇంగ్లాండ్ సెమీస్‌కు చేరుతుంది. ఇక, ఈ మెగా టోర్నీలో కోహ్లీసేన ఇంకా బంగ్లాదేశ్, శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ సెమీస్‌కు వెళ్తుంది.
టీమిండియా విజయ లక్ష్యం 338
అంతకముందు జానీ బెయిర్ స్టో(111) సెంచరీ సాధించగా బెన్ స్టోక్స్(79), జేసన్ రాయ్(66) హాఫ్ సెంచరీలతో మెరవగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లతో మరోసారి సత్తాచాటగా... బుమ్రా, కుల్దీప్‌లు తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఆరంభం నుంచీ దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్ స్టోలు చేలరేగారు. వీరిద్దరి జోడి తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత జేసన్ రాయ్(66) ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్ పట్టడంతో రాయ్ ఇన్నింగ్స్ ముగిసింది.
అనంతరం బెయిర్ స్టో-జోరూట్‌లు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే యత్నం చేశారు. ఈ క్రమంలోనే బెయిర్ స్టో సెంచరీ నమోదు చేశాడు. సెంచరీ అనంతరం బెయిర్ స్టో దూకుడుగా ఆడే క్రమంలో 111 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత మరో రెండు పరుగుల వ్యవధిలో ఇయాన్ మోర్గాన్(1) కూడా ఔట్ కావడంతో ఇంగ్లండ్ 207 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్‌తో కలిసి జో రూట్ స్కోరు బోర్డుని నడిపించాడు. వీరిద్దరూ 50 పరుగులు జత చేసిన తర్వాత జో రూట్ నాలుగో వికెట్ పెవిలియన్ చేరాడు.
ఇక జోస్ బట్లర్(20), క్రిస్ వోక్స్(7)లు నిరాశపరిచినా, స్టోక్స్ చివరి ఓవర్ వరకూ క్రీజ్‌లో ఉండటంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.
{headtohead_cricket_2_3}