నిలకడగా రోహిత్, కోహ్లీ: 10 ఓవర్లకు టీమిండియా 28/1

హైదరాబాద్: బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 10 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(17), రోహిత్ శర్మ(11) పరుగులతో ఉన్నారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 338 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఓపెనర్ లోకేశ్ రాహుల్‌ను క్రిస్ వోక్స్ పెవిలియన్‌కు పంపాడు. 9 బంతులు ఆడిన రాహుల్ (0) వోక్స్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. ముఖ్యంగా నాలుగో ఓవర్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో ఒక్క పరుగే వచ్చింది. ఐదో ఓవర్‌లో వోక్స్ మళ్లీ మేడిన్ చేశాడు.
అంతకముందు జానీ బెయిర్ స్టో(111; 109 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ సాధించగా బెన్ స్టోక్స్(79; 54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జేసన్ రాయ్(66;57 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. జో రూట్(44; 54 బంతుల్లో 2 ఫోర్లు) సమయోచితంగా ఆడటంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది.
భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లతో మరోసారి సత్తాచాటాడు. ఇంగ్లండ్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షమీ కీలక వికెట్లు సాధించాడు. బుమ్రా, కుల్దీప్‌లు తలో వికెట్ తీశారు.
{headtohead_cricket_3_2}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications