
హైదరాబాద్: బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 76 బంతుల్లో 66(7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీకి ఇది వరుసగా ఐదో అర్ధ సెంచరీ.
తద్వారా ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్‌లో వరుసగా ఐదు సెంచరీలు బాదిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ గత నాలుగు మ్యాచుల్లో వెస్టిండీస్ (72), అఫ్గానిస్థాన్ (67), పాకిస్థాన్ (77), పాకిస్థాన్‌పై (82) హాఫ్ సెంచరీలు సాధించాడు. 1992 ప్రపంచకప్‌లో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు.
అయితే, అజారుద్దీన్ వరుస ఇన్నింగ్స్‌ల్లో సాధించక పోవడం విశేషం. కాగా, 2015 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీన్ స్మిత్ కూడా ఇలా వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. దీంతో స్టీవ్ స్మిత్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ సమం చేశాడు. కాగా, హాఫ్ సెంచరీ అనంతరం కోహ్లీ ఫ్లంకెట్ బౌలింగ్‌లో రెండో బాల్‌ను విన్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
కోహ్లీ అర్ధ సెంచరీ బాదిన కాసేపటికే ఓపెనర్ రోహిత్ శర్మ కూడా అర్ధ శతకం నమోదు చేశాడు. కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. ప్రస్తుతం 23 ఓవర్లకు గాను భారత్ వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది.
ద్రవిడ్ రికార్డు బద్దలు:
వన్డేల్లో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా రాహుల్ ద్రావిడ్ (1238) పేరిట ఉన్న రికార్డునూ కూడా కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ మరో 31 పరుగులు సాధిస్తే ప్రపంచకప్‌లో 1000 పరుగులు సాధించిన భారత మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. టీమిండియా తరఫున సచిన్ (2278), గంగూలీ (1006) ప్రపంచకప్‌లో వెయ్యికి పైగా పరుగులు సాధించారు.
{headtohead_cricket_2_3}