
హైదరాబాద్: సౌథాంప్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. భారత పేసర్లు రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ జట్టు ఆదిలోనే మూడు కీలక వికెట్లు చేజార్చుకుని 28/3తో ఒత్తిడిలో నిలిచింది.
ప్రస్తుతం 14 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది. క్రీజులో జానీ బెయిర్ స్టో (6), బెన్ స్టోక్స్ (1) పరుగులతో ఉన్నారు. నాలుగో టెస్టులో ఆతిథ్య జట్టు ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ కీటన్ జెన్సింగ్స్(0) వికెట్ల ముందు దొరికిపోయాడు.
ఈ వికెట్‌తో ఇషాంత్ శర్మ అత్యంత నిదానంగా 250 వికెట్లు తీసిన బౌలర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత బుమ్రా ఇన్నింగ్స్ 13 ఓవర్ చివరి బంతికి జానీ బెయిర్‌స్టో (6)ను పెవిలియన్ పంపాడు. బుమ్రా బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చిన బెయిర్‌స్టో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.
దీంతో 28 పరుగులకే మూడు వికెట్లు కీలక కోల్పోయిన ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఇషాంత్ శర్మ, బుమ్రా బంతులకు ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ తడబడుతూ వికెట్లు సమర్పించుకుంటున్నారు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇప్పటికే మూడు టెస్టులు ముగియగా ఆతిథ్య ఇంగ్లాండ్ 2-1తేడాతో ముందంజలో ఉంది. దీంతో ఈ నాలుగో టెస్టు కోహ్లీసేనకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.