Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDVENG, DAY1: లంచ్ విరామానికి ఇంగ్లాండ్‌ స్కోరు 57/4

India vs England Live Score, 4th Test Day 1: England 57/4 At Lunch vs India

సౌతాంప్టన్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు పూర్తి సాధికారత ప్రదర్శించారు. నాలుగో టెస్టులో టీమిండియా బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులు విసురుతున్నారు. వెంటవెంటనే వికెట్లు తీసి భారత్‌కు శుభారంభం అందించారు. దీంతో తొలి రోజు లంచ్‌ బ్రేక్‌కు ఇంగ్లాండ్‌ 57/4తో నిలిచింది.

మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వంద భాగస్వామ్యంతో అదరగొట్టిన జోస్‌ బట్లర్‌ 15 బంతుల్లో 2 ఫోర్లతో(13), బెన్‌స్టోక్స్‌ 41 బంతుల్లో ఒక ఫోర్(12) జోడీ నిలిచింది. ఆచితూచి ఆడుతూ బౌలర్లను ఎదుర్కొంటోంది. జస్ప్రీత్‌ బుమ్రా పదునైన బంతులు విసిరాడు. కీటన్‌ జెన్నింగ్స్‌ (0), జానీ బెయిర్‌స్టో 16 బంతుల్లో(6)ను పెవిలియన్‌కు పంపించాడు.

ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ (4)ను ఇషాంత్‌, చాలాసేపట్నుంచి నిలకడగా ఆడిన ఓపెనర్‌ అలిస్టర్‌ కుక్‌ 55 బంతుల్లో 3ఫోర్లతో(17) ను హార్దిక్‌ పాండ్య పెవిలియన్‌ పంపించాడు. ఔట్‌స్వింగర్‌ను వెంటాడిన కుక్‌ స్లిప్‌లో విరాట్‌ కోహ్లీకి చిక్కాడు.

1
42377

'భారత జట్టులో ప్రస్తుతం అందరూ ఫిట్‌గా ఉన్నారు. గాయపడిన అశ్విన్‌.. పూర్తిగా కోలుకున్నాడు. అతను ప్రాక్టీస్ సెషన్‌లోనూ చురుగ్గా కనిపించాడు. తుది జట్టులో తరచూ మార్పులు చేయాలని నేను ఆశించను. కానీ.. గాయాల కారణంగా ఇప్పటి వరకు కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. మూడో టెస్టులో జట్టు సమతూకంగా కనిపించింది. కాబట్టి.. నాలుగో టెస్టుకి జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం నాకు కనిపించడం లేదు' అని కోహ్లీ వెల్లడించాడు.

ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు టెస్టులు ముగియగా.. తొలి రెండు టెస్టుల్లోనూ భారత్ జట్టు పేలవరీతిలో ఓడిపోయింది. మూడో టెస్టులో అనూహ్యంగా పుంజుకుని గెలిచిన టీమిండియా.. నాలుగో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ని 2-2తో సమం చేయాలని ఆశిస్తోంది.

Story first published: Thursday, August 30, 2018, 18:31 [IST]
Other articles published on Aug 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+