Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలిటెస్టు, డే 3: కష్టాల్లో ఇంగ్లాండ్, లంచ్ విరామానికి 86/6

India vs England Live Score 1st Test, Day 3: Ashwin and Ishant leave England reeling at lunch

హైదరాబాద్: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ బౌలర్లు చెలరేగుతున్నారు. ఓవర్ నైట్ స్కోరు 9/1తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ లంచ్ విరామ సమయానికి 30.4 ఓవర్లలో ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జోస్ బట్లర్ (1) పరుగుతో ఉన్నాడు.

ఓవర్ నైట్ స్కోరు 9/1తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జెన్నింగ్స్‌(8) వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది. ఆ తర్వాత స్వల్ప విరామాల్లో జో రూట్‌(14), మాలన్‌(20), బెయిర్‌ స్టో(28), బెన్‌ స్టోక్స్‌(6) వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారు. దీంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 86 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

మూడో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ను అశ్విన్‌ కూల్చగా, ఆ తర్వాత ఇషాంత్‌ శర్మ విజృంభించాడు. ఇషాంత్ శర్మ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. ఇంగ్లాండ్‌ కోల్పోయిన ఆరు వికెట్లలో అశ్విన్‌, ఇషాంత్‌ శర్మలు తలో మూడు వికెట్లు సాధించారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 99 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

1
42374

నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌‌లో తడబడుతోంది. జట్టు స్కోరు 70 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఇషాంత్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్ (20) రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో రాణించిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ చెలరేగుతున్నాడు. ఇప్పటికే మూడు వికెట్లు తీశాడు. 28 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 88 పరుగుల ఆధిక్యంలో ఉంది.


చెలరేగుతున్న అశ్విన్
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. ఓవర్‌నైట్ స్కోరు 9/1తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ వరుసగా వికెట్లను చేజార్చుకుంటుంది. అశ్విన్ తన స్పిన్‌తో మాయ చేస్తున్నాడు. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓపెనర్ కీటన్ జెన్నింగ్స్‌ను ఔట్ చేసిన అశ్విన్, ఆ తర్వాత కెప్టెన్ జో రూట్‌(14)ను పెవిలియన్ పంపి భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు. 16వ ఓవర్ తొలి బంతిని షాట్ ఆడగా ఆ బాల్ మళ్లీ రాహుల్‌కే చిక్కడంతో రూట్ మైదానాన్ని వీడాడు. దీంతో మ్యాచ్‌పై భారత్ పట్టుసాధించింది. ప్రస్తుతం క్రీజులో జానీ బెయిర్‌స్టో(5), డేవిడ్ మలాన్(17) పరుగులతో ఉన్నారు.


రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ఆరంభమైంది. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే కీటన్‌ జెన్నింగ్స్‌ (8) పరుగుల వద్ద రవిచంద్రన్‌ అశ్విన్‌ పెవిలియన్‌కు చేర్చాడు. అశ్విన్ వేసిన 7.4వ బంతికి స్లిప్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

జెన్నింగ్స్ ఔటైన తర్వాత క్రీజులోకి డేవిడ్‌ మలన్‌ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్‌ 2 వికెట్లు కోల్పోయి 21 పరుగులు చేసింది. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 287 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. మరోవైపు కోహ్లీ (149)సెంచరీతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, August 3, 2018, 19:14 [IST]
Other articles published on Aug 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+