
హైదరాబాద్: విదేశీ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్‌తో తొలి పోరులో తలపడిన కోహ్లీసేన శుభారంభాన్ని నమోదు చేసుకుంది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీసేన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ 8 వికెట్లు పడగొట్టి 158 పరుగులకు కట్టడి చేసింది. ఇందులో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఉమేశ్ యాదవ్ 2, పాండ్యా 1వికెట్ తీయగలిగారు.
అనంతరం చేధనకు దిగిన భారత బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్ బౌలర్లపై తమ సత్తా చాటారు. దీంతో పది బంతులు మిగిలి ఉండగానే.. ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఇది శుభారంభం. ఓపెనర్లు ఇద్దరూ అవుటయిపోవడంతో.. మ్యాచ్ రాహుల్, కోహ్లీ చేతుల మీదుగా ముగిసింది. రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రాణించి 54బంతుల్లోనే 101 పరుగులు (10 ఫోర్లు, 5 సిక్సులతో) సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ శర్మ అవుటయిపోవడంతో మరో ఎండ్‌లో బ్యాటింగ్ దిగిన కోహ్లీ 22 బంతుల్లో (20) పరుగులు చేసి విన్నింగ్ షాట్‌గా బంతిని సిక్సు బౌండరీకి పంపించాడు. ఇక ధావన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే 4బంతులు ఆడి 4 పరుగులు మాత్రమే చేయగా... రోహిత్ 30బంతుల్లో 32 పరుగులు చేశాడు.
దూకుడుగా ఆడుతున్న రాహుల్, పది ఓవర్లు పూర్తయ్యేసరికి: 103/1
టార్గెట్ చిన్నదే అయినా.. ఆతిథ్య జట్టుతో తలపడుతున్న భారత్‌కు కష్టతరమే. అయినా పటిష్టమైన టాప్ ఆర్డర్‌తో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్ సత్తా చాటుతున్నారు. ఇన్నింగ్స్ ఆరంభించిన కాసేపటికే.. రెండో ఓవర్లోనే ధావన్‌ను భారత్ కాస్త జోరు తగ్గించింది. ధావన్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన క్రమేపి పుంజుకుని ఇంగ్లాండ్ బౌలర్లపై బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు.
మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ చక్కని భాగస్వామ్యం పెంపొందేలా సహకరిస్తున్నాడు. ఈ క్రమంలో పది ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టానికి రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తిచేసేశాడు. క్రీజులో రాహుల్ (65), రోహిత్ శర్మ(29) ఉన్నారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్:
తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. పర్యటక జట్టు భారత్‌కు 160 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. ఆరంభంలో దూకుడుగా ఆడిన ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరకు వచ్చేసరికి అంతగా రాణించలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆతిథ్య జట్టులో ఓపెనర్లు జాసన్ రాయ్ (30), బట్లర్ (69), డేవిడ్ విల్లే(29) రాణించారు.
అలెక్స్ హేల్స్(8), మోర్గాన్(8), బెయిర్‌స్టో(0), రూట్(0), మొయిన్ అలీ(6), జోర్డాన్ (0), ప్లంకెట్(3) పరుగులు చేశారు. మొదటి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం చేసినా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయలేకపోయింది. కుల్‌దీప్ యాదవ్ చురకత్తులాంటి బంతులతో ఇంగ్లాండ్ నడ్డివిరిచాడు. నాలుగు ఓవర్లు వేసిన కుల్‌దీప్ 24 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్‌యాదవ్ 2, హార్దిక్ పాండ్య ఒక వికెట్ తీసుకొన్నారు.
మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి:
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత బౌలర్లు ఆరంభంలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌పై కాస్త కంగారుకు లోనైయ్యారు. ఈ క్రమంలో 5 ఓవర్లకు ఇంగ్లాండ్ 50 పరుగులు చేసింది. ఇదే 5 ఓవర్‌లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్ ఇంగ్లాండ్ తొలి వికెట్ జాసన్ రాయ్‌ను కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేసి క్రమంగా వేగం తగ్గించారు. ఆ తర్వాత స్పిన్నర్లు తమ ప్రతాపం చూపి.. ఇంగ్లీషు బ్యాట్స్ మెన్‌ను కట్టడి చేస్తున్నారు. పది ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది.
టాస్ రిపోర్టు:
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం భారత్ తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొనబోతోంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది.
బలమైన జట్లతో, చక్కటి ఫామ్‌తో బరిలోకి దిగుతున్న భారత్, ఇంగ్లాండ్ మధ్య రసవత్తర పోరు ఖాయమనిపిస్తోంది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆ దేశంలో భారత జట్టు పర్యటన టీమిండియాకు అత్యంత కీలకం.
2019 ప్రపంచకప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తుండటంతో టీమిండియా కూర్పుపై సెలెక్టర్లు ఇప్పటి నుంచే దృష్టిసారించే అవకాశం లేకపోలేదు. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో రాణించగలిగే ఆటగాళ్లపై ఓ అంచనాకు వస్తారనడంలో అనుమానమూ లేదు. ఈ పర్యటన భారత ఆటగాళ్లకు పెద్ద పరీక్షే. ఇంగ్లాండ్‌తో జరగనున్న షార్ట్ ఫార్మాట్‌లో సిరీస్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది.