
హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీసేన పట్టు బిగించింది. మూడో రోజైన సోమవారం ఓవర్ నైట్ స్కోరు 124/2తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ జట్టు.. లంచ్ విరామ సమయానికి 60 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ (56 బ్యాటింగ్), పుజారా (54 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఇంగ్లాండ్‌పై 362 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని ముందుకు నడిపించారు.
పదేపదే ఇంగ్లండ్ సారథి జోయ్ రూట్ బౌలింగ్ మారుస్తూ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలను ఈ జోడీ సమర్థవంతంగా ఎదుర్కొంది. వికెట్‌ని కాపాడుకుంటూ.. ఆధిక్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఫామ్‌లో లేక నానాతంటాలు పడుతున్న పుజారా తిరిగి మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు.
ఈ క్రమంలో 147 బంతులు ఆడిన పుజారా 7 ఫోర్ల సాయంతో తన టెస్ట్ కెరీర్‌లో 18వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత కొంత సమాయానికే కోహ్లీ 82 బంతుల్లో 5 ఫోర్లతో తన టెస్ట్ కెరీర్‌లో 19వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. దీంతో మూడో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకపోతోంది.