రెండేళ్ల తర్వాత వన్డే సిరీస్ ఓటమి రుచి చూసిన టీమిండియా

హైదరాబాద్: భారత జట్టు జైత్రయాత్రకి ఇంగ్లాండ్ బ్రేక్‌లేసింది. రెండేళ్ల నుంచి వరుసగా తొమ్మిది ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో గెలుపొందిన టీమిండియా.. మంగళవారం రాత్రి 1-2 తేడాతో ఇంగ్లాండ్‌కు వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. 2016, జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ చివరిసారి ఓడింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐదు వన్డేల ఆ సిరీస్‌లో ఆఖరి వన్డే మినహా.. తొలి నాలుగు వన్డేల్లోనూ టీమిండియా ఓటమి చవిచూసింది. ఐదో వన్డేలో మనీశ్ పాండే అజేయ శతకం బాదడంతో ఆఖరి ఓవర్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ పేలవరీతిలో విఫలమై:
లీడ్స్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన సిరీస్ విజేత నిర్ణయాత్మక వన్డేలో భారత్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ పేలవరీతిలో విఫలమైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (71: 72 బంతుల్లో 8ఫోర్లు) హాఫ్ సెంచరీ బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 44.3 ఓవర్లలోనే 260/2తో ఛేదించేసింది.

భారత్‌కు భిన్నంగా ఇన్నింగ్స్ ఆరంభించి:
టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు.. భారత్‌కు భిన్నంగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు విన్స్ (27; 27 బంతుల్లో 5ఫోర్లు), బెయిర్‌స్టో (30; 13 బంతుల్లో 7 ఫోర్లు) ధాటిగా ఆడటంతో నాలుగు ఓవర్లలోనే 38 పరుగులు చేసింది. ఎక్కువ షార్ట్ బంతులేసిన భువనేశ్వర్ ధారాళంగా పరుగులిచ్చాడు. అతడు వేసిన నాలుగో ఓవర్లో నాలుగు ఫోర్లు బాదిన బెయిర్‌స్టో.. తర్వాత పాండ్య బౌలింగ్‌లో మరో మూడు బంతులను బౌండరీ దాటించాడు.

రూట్, కెప్టెన్ మోర్గాన్ అలవోకగా బ్యాటింగ్
తర్వాతి ఓవర్లో అతణ్ని శార్దూల్ ఔట్ చేసినా అది ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. రూట్, కెప్టెన్ మోర్గాన్ అలవోకగా బ్యాటింగ్ చేస్తూ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లారు. భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బందిపడ్డ అదే పిచ్‌పై ఈ ఇద్దరూ సాధికారికంగా ఆడారు. క్రమం తప్పకుండా సింగిల్స్ తీస్తూ, వీలైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్వేచ్ఛగా సాగిపోయారు.

రాణించలేకపోయిన స్పిన్నర్లు కుల్‌దీప్, చాహల్
స్పిన్నర్లు కుల్‌దీప్, చాహల్ కూడా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టలేకపోయారు. చాహల్ పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్ పడగొట్టలేకపోయాడు. స్పిన్నర్లతోపాటు ప్రధాన పేసర్ భువనేశ్వర్ కూడా విఫలం కావడంతో ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడం భారత్‌కు కష్టమైపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications