Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీకి 2016 కలిసొచ్చింది: బ్యాటింగ్ రికార్డులివే

హైదరాబాద్: ముంబై టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించడంలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సాధించిన డబుల్ సెంచరీ కీలకపాత్ర పోషించింది. అంతేకాదు ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

కోహ్లీ సాధించిన 235 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌పై ఆధిక్యంలో నిలవడంలో ఎంతగానో దోహదపడ్డాయి. ఈ ఏడాది కోహ్లీకి ఇది మూడో డబుల్ సెంచరీ కావడం విశేషం. కోహ్లీ, అశ్విన్‌ల అద్భుత ప్రదర్శనతో ముంబై టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం సాధించింది.

ఈ విజయంతో టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో వేరొక మ్యాచ్ మిగిలుండగానే సిరిస్‌ను కైవసం చేసుకుంది. ముంబై టెస్టులో కెప్టెన్ పలు రికార్డులను సైతం సృష్టించాడు. నాలుగో టెస్టులో కోహ్లీ (235) డబుల్ సెంచరీ సాధించడంతో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన భారత టెస్టు కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.

టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన భారత టెస్టు కెప్టెన్‌

టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన భారత టెస్టు కెప్టెన్‌

నాలుగో టెస్టులో కోహ్లీ (235) డబుల్ సెంచరీ సాధించడంతో అత్యధిక వ్యక్తిగత పరగులు సాధించిన భారత టెస్టు కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉంది. 2013లో ఆస్ట్రేలియాపై ధోని సాధించిన 224 పరుగులే ఇప్పటివరకూ టెస్టుల్లో భారత కెప్టెన్‌గా అత్యధిక స్కోరు. ముంబై టెస్టులో కోహ్లీ ఈ రికార్డుని అధిగమించాడు. అంతేకాదు ఒక కేలండర్ ఇయర్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు.

ఒకే ఏడాది మూడు డబుల్ సెంచరీలు

ఒకే ఏడాది మూడు డబుల్ సెంచరీలు

ఈ ఏడాది మొదట్లో వెస్టిండిస్‌తో కరేబియన్ దీవుల్లో జరిగిన టెస్టులో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇటీవలే స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో కోహ్లీ 211 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు. ఇక తాజాగా ముంబైలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు. దీంతో ఒక ఏడాదిలో మూడు సెంచరీలు సాధించిన తొలి కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. గతంలో ఒక కేలండర్ ఇయర్‌లో భారత తరపున వినోద్ మన్కడ్, వినోద్ కాంబ్లి, రాహుల్ ద్రవిడ్ రెండు డబుల్ సెంచరీలు సాధించారు.

టెస్టుల్లో 4,000 పరుగులు

టెస్టుల్లో 4,000 పరుగులు

ముంబై టెస్టులో కోహ్లీ 4000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. 89 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించిన ఆరో భారతీయ బ్యాట్స్ మెన్‌గా గుర్తింపు పొందాడు. 2010లో సెహ్వాగ్ 1422 పరుగులు నమోదు చేశాడు. టెస్టుల్లో 4000 పరుగుల మైలురాయిని అందుకున్న 14వ బ్యాట్స్ మెన్‌గా కోహ్లీ గుర్తింపు పొందాడు.

ఒక కేలండర్ ఇయర్‌లో 1000 పరుగులు

ఒక కేలండర్ ఇయర్‌లో 1000 పరుగులు

నాలుగో టెస్టులో కెప్టెన్ కోహ్లీ ఒక కేలండర్ ఇయర్‌లో 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీంతో 2016లో విరాట్ కోహ్లీ టెస్టుల్లో 1000 పరుగులు సాధించినట్లైంది. గతంలో ఈ రికార్డుని టీమిండియా కెప్టెన్లుగా ఇద్దరు మాత్రమే సాధించారు. 1997లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, 2006లో రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రమే ఈ ఘనత అందుకున్న కెప్టెన్లుగా ఉన్నారు. ఒకే ఏడాదిలో టెస్టుల్లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మొదటి స్ధానంలో ఉన్నాడు. 2010లో సచిన్ టెండూల్కర్ 1562 పరుగులను చేశాడు. ఆ తర్వాతి స్ధానంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆటగాడిగా రెండో స్థానంలో ఉన్నాడు.

50కి పైగా యావరేజితో

50కి పైగా యావరేజితో

ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో విరాట్ కోహ్లీ 50.53 యావరేజితో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. టెస్టుల్లో 50కి పైగా యావరేజిని కోహ్లీ కలిగి ఉండటం ఇదే తొలిసారి. వన్డేల్లో 52.93 యావరేజి ఉండగా, టీ20ల్లో 57.13 యావరేజితో కోహ్లీ ఉన్నాడు. మూడు ఫార్మెట్లలో కూడా 50కి పైగా యావరేజిని కలిగి ఉన్న ఏకైక బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీనే.

బ్రాడ్ మాన్ తర్వాత కోహ్లీనే

బ్రాడ్ మాన్ తర్వాత కోహ్లీనే

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ యావరేజి 65.50గా ఉంది. టెస్టుల్లో 2000కు పైగా పరుగులు సాధించిన కెప్టెన్లలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సర్ డాన్ బ్రాడ్ మన్ 101.51తో మొదటి స్ధానంలో ఉండగా, కోహ్లీ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.

2016లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు

2016లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు

2016లో 36 అంతర్జాతీయ మ్యాచ్ లాడిన ఆడిన కోహ్లీ 40 ఇన్నింగ్స్‌ల్లో 2580 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 88.96 యావరేజిని కలిగి ఉన్నాడు. అందులో ఏడు సెంచరీలు ఉండగా, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇందులో 8 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ఉండగా, రెండు మ్యాన్ ఆఫ్ ద సిరిస్‌లు ఉన్నాయి.

జయంత్ యాదవ్‌తో రికార్డు భాగస్వామ్యం

జయంత్ యాదవ్‌తో రికార్డు భాగస్వామ్యం

ముంబై టెస్టులో 8 వికెట్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, జయంత్ యాదవ్‌లు కలిసి 241 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఎనిమిదో వికెట్‌కు 241 పరుగులు జోడించిన భారతీయ జోడిగా చరిత్ర సృష్టించారు. ఏ జట్టుపైనైనా టీమిండియా తరఫున ఎనిమిదో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. 1908లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఆటగాళ్లు హార్టిగాన్, హిల్స్‌ల జోడి నెలకొల్పిన 243 పరుగులే ఇప్పటివరకు అత్యధిక స్కోరుగా ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+