టీమిండియాలో అనూహ్యంగా చోటు.. అసలు ఎవరీ విహారీ?

నాటింగ్‌హామ్: టీమిండియాలో అనూహ్య రీతిలో జట్టు సంపాదించుకున్నాడు హనుమ విహారీ. ఇదే ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. జాతీయ క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్న విహారి కాకినాడలో పుట్టి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ విషయం గోదావరి ప్రాంతవాసులకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోంది.
టీమిండియాలో చోటు దక్కించుకున్న విహారి పూర్తి పేరు గాదె హనుమ విహారి. 1993 అక్టోబర్ 13న కాకినాడలో జన్మించాడు. తండ్రి సత్యనారాయణ సింగరేణిలో సూపరింటెండెంట్‌గా పని చేస్తుండడంతో పుట్టిన కొద్ది రోజులకే విహారి అక్కడికి వెళ్లిపోయాడు. మూడో తరగతి వరకు గోదావరిఖని, మణుగూరులలోను, ఆ తరువాత హైదరాబాద్‌లోను చదువు కొనసాగించాడు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో రెండేళ్లుగా:
క్రికెట్‌లో అనతికాలంలోనే ఉన్నత స్థానానికి విహారి ఎదగగలిగాడు. 2012 అండర్-19 ప్రపంచ కప్ జట్టులో తొలిసారిగా స్థానం పొందాడు. ఆ తరువాత రంజీ పోటీల్లో మరింతగా రాణించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 59.45 అత్యధిక సగటుతో ప్రపంచ క్రికెట్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కొనసాగుతున్న విహారి రెండేళ్లుగా తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ టీమిండియాలో స్థానం దక్కించుకున్నాడు.

తల్లి ఇచ్చిన స్ఫూర్తి వల్లనే:
చిన్ననాటి నుంచి విహారి క్రీడలపై ఆసక్తి కనబరిచేవాడు. ఫుట్‌బాల్‌తోపాటు క్రికెట్‌పై మక్కువ చూపేవాడు. తల్లి క్రికెట్‌లో సచిన్, ద్రవిడ్ వంటి క్రీడాకారులు ఎంత కష్టపడి ఉన్నతస్థాయికి చేరుకున్నారో తరచూ చెబుతుండడంతో క్రికెట్‌పై విహారికి మక్కువ పెరిగింది. ఏడో ఏట హైదరాబాద్‌లో సెయింట్ జాన్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ కోచ్ జాన్‌మోజెస్ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ పొందాడు.

తల్లి తండ్రుల భావోద్వేగమిలా:
తెలుగు రాష్ట్రాల క్రికెట్ క్రీడాకారుల్లో ఎమ్మెస్కే ప్రసాద్ తరువాత విహారే. విహారి ప్రస్తుత తరం క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తాడని, బాలుర, బాలికల జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కేవీఎస్ కామరాజు, కిరణ్‌రాజ్, సంయుక్త కార్యదర్శి కొండలరావు, పీడీ స్పర్జన్‌రాజు ఆనందం వ్యక్తం చేశారు. అంకిత భావంతో తన కుమారుడు చేసిన కృషి ఈ స్థాయికి తెచ్చిందని అతని తల్లి విజయలక్ష్మి తెలిపారు.

విహారికి అభినందనల వెల్లువ
ఆంధ్ర రంజీట్రోఫీ లో నిలకడైన ప్రదర్శనకు చక్కటి గుర్తింపు తెచ్చుకుని ఇంగ్లండ్‌లో జరగనున్న చివరి రెండు టెస్ట్‌లకు భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న జిల్లాకు చెందిన ఆటగాడు గాదె హనుమ విహారి అభినందనీయుడని జిల్లా బాలుర, బాలికల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీఎస్‌డీ కామరాజు అన్నారు. ఇలా పలు సంఘాలు నాయకులు, తోటి క్రీడాకారులు విహారీకి అభినందనలు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications