Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: బిన్నంగా కేఎల్ రాహుల్ 'సెంచరీ' సెలబ్రేషన్స్.. అసలు కారణం ఇదే!!

India vs England: KL Rahul reveals the reason behind his century celebrations

పూణే: సెంచరీ.. ఏ బ్యాట్స్‌మన్‌కు అయినా ఓ అరుదైన ఘనత. ఫార్మాట్ ఏదైనా ప్రతిఒక్క బ్యాట్స్‌మన్‌ శతకం భాధాలని చూస్తాడు. అయితే క్రికెట్‌లో ఏ ఫార్మాటైనా బ్యాట్స్‌మెన్‌ సెంచరీ సాధిస్తే.. ఆ అనుభూతే వేరు. అది ఆ ఆటగాడికే కాకుండా అభిమానులకూ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. సెంచరీ అంటే అంత విలువ మరి. సెంచరీ చేసినప్పుడు ఒక్కో ఆటగాడు ఒక్కోలా సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. చాలామంది బ్యాటును పైకిలేపి వందనం చేస్తారు. కొందరు పైకి ఎగిరి పంచ్‌ ఇస్తారు. టీమిండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం అందరికంటే భిన్నంగా వేడుకలు చేసుకుంటాడు. హెల్మెట్‌ తీసి బ్యాటు కిందపెట్టి రెండు చేతులతో చెవులను మూసుకుంటాడు.

శబ్ధాన్ని నిలువరించడానికే:

శబ్ధాన్ని నిలువరించడానికే:

అందరికంటే బిన్నంగా సెంచరీ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకుంటాడో కేఎల్ రాహుల్‌ శుక్రవారం తెలిపాడు. భారత్ ఇన్నింగ్స్ అనంతరం రాహుల్ మాట్లాడుతూ... 'బయట నుంచి వచ్చే శబ్ధాన్ని నిలువరించడానికే అలా చేశాను. అంతేతప్ప ఎవరినీ అగౌరవపరచడానికి కాదు. మనల్ని వెనక్కి లాగే చాలామంది బయట ఉంటారు. అన్నిసార్లూ వారిని పట్టించుకోకూడదు. నా సంబరాల అసలు సందేశం అదే. ఇందులో మరే ఉద్దేశం ఏమీ లేదు' అని స్పష్టం చేశాడు.

300 పరుగులు చేయాలనుకున్నాం:

300 పరుగులు చేయాలనుకున్నాం:

'టీ20 సిరీస్‌ తర్వాత నేను చాలా నిరాశపడ్డాను. కానీ ఆట అంటే అలాగే సాగుతుంది. కొన్ని నాణ్యమైన షాట్లు నా ఆందోళనను తొలగించాయి. విరాట్ కోహ్లీ‌, రిషబ్ పంత్‌లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పినందుకు సంతోషంగా ఉంది. నేను, విరాట్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు 300 పరుగులు చేయాలనుకున్నాం. భారీ స్కోరు చేయడం సంతోషాన్నిచ్చింది. ఈ రోజు వాతావరణం చాలా వేడిగా ఉంది. కానీ మేం భాగస్వామ్యాలు నిర్మించడం ముఖ్యం. అందుకే ఈ స్కోరు నాకు ఆనందం కలిగిస్తోంది. ఎప్పుడు పరుగులు చేసినా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది' అని రాహల్ చెప్పుకొచ్చాడు.

టీ20 సిరీస్‌లో విఫలం:

టీ20 సిరీస్‌లో విఫలం:

ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌లో కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌లాడిన రాహుల్.. 1, 0, 0, 14 పరుగులే చేశాడు. దాంతో ఐదో టీ20లో అతనిపై వేటు పడింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ అతడిపై ఉన్న నమ్మకంతో తొలి వన్డేలో ఛాన్స్ ఇచ్చాడు. రాహుల్ 62 పరుగులతో అజేయంగా నిలిచి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక రెండో వన్డేలో ఏకంగా సెంచరీతో చెలరేగాడు. విమర్శలు ఎదురైనప్పుడు ఆటగాళ్లు సరికొత్తగా సంబరాలు చేసుకొనే సంగతి తెలిసిందే.

అందుకే విఫలమయ్యా:

అందుకే విఫలమయ్యా:

రెండో వన్డేకు ముందు కేఎల్‌ రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ... 'నిరంతరం మ్యాచులు ఆడుతుంటే నా లయ బాగుంటుంది. నాకు ఇష్టమైనంత గేమ్‌ టైమ్‌ దొరక్కపోతే ఇబ్బంది పడతాను. నా మదిలో అదే మెదులుతూ ఉంటుంది. అందుకే సన్నద్ధమయ్యేందుకు ఏదో ఒక దారి వెతకాలి. అది శిక్షణైనా కావొచ్చు లేదా ఓపెన్‌ నెట్‌ సెషన్‌ అయినా కావొచ్చు. నేను సన్నద్ధమయ్యేందుకు సాధ్యమైనంత ప్రయత్నిస్తాను. కానీ మ్యాచ్‌లు ఆడటానికి ఏదీ సాటిరాదు. మ్యాచ్ ఆడితే అదో కిక్కు. నా సన్నద్ధతపై విశ్వాసం వల్లే వన్డేలో పుంజుకోగలిగా' అని అన్నాడు.

Story first published: Saturday, March 27, 2021, 17:02 [IST]
Other articles published on Mar 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+