Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

13 ఏళ్ల రికార్డు బద్దలు: ద్రవిడ్ రికార్డుని సమం చేసిన కేఎల్ రాహుల్

India vs England: KL Rahul achieves rare feat, equals Rahul Dravid at Oval

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఓవల్ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐదో టెస్టులో రెండో రోజైన శనివారం స్టువర్ట్‌ బ్రాడ్‌ క్యాచ్‌ అందుకోవడం కేఎల్‌ రాహుల్‌ ఈ ఘనత సాధించాడు.

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత క్రికెటర్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ రికార్డును సమం చేశాడు. 2004-05 ఆస్ట్రేలియాలో సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్‌ 13 క్యాచ్‌లు అందుకున్నాడు. మొత్తంగా ఐదు టెస్టుల సిరీస్‌లో ఎక్కువ క్యాచ్‌లు (15) అందుకున్న ఆటగాడి రికార్డు జాక్‌ గ్రెగోరి (ఆస్ట్రేలియా) పేరు మీద ఉంది.

1
42378
ఆ రికార్డును కేఎల్ రాహుల్ అధిగమిస్తాడేమో!

ఆ రికార్డును కేఎల్ రాహుల్ అధిగమిస్తాడేమో!

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరి టెస్టులో ఇంగ్లాండ్‌ ఇంకో ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది కాబట్టి కేఎల్ రాహుల్‌ ఆ రికార్డును అధిగమిస్తాడేమో తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే, ఈ సిరిస్‌లో భారత పేసర్లు 38 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. ఈ క్రమంలో భారత పేసర్ల ఖాతాలో అరుదైన రికార్డు చేరింది.

59 వికెట్లు పడగొట్టిన భారత పేసర్లు

59 వికెట్లు పడగొట్టిన భారత పేసర్లు

ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా 59 వికెట్లు పడగొట్టిన భారత పేసర్లు విదేశీ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఘనత సాధించారు. ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా ఇషాంత్‌ 18, షమి 14, బుమ్రా 14, హార్దిక్‌ పాండ్య 10, ఉమేశ్‌ యాదవ్‌ 3 వికెట్లు తీశారు. ఈ క్రమంలో వాళ్లు 38 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌ సిరీస్‌ (1979-80)లో కపిల్‌దేవ్‌ (25 వికెట్లు), కర్సన్‌ ఘావ్రి (15), రోజర్‌ బిన్ని (11) నెలకొల్పిన అత్యధిక వికెట్ల (58) రికార్డును తిరగరాశారు.

రెండో రోజు తేలిపోయిన టీమిండియా

రెండో రోజు తేలిపోయిన టీమిండియా

కాగా, ఐదో టెస్టులో తొలి రోజు ఫర్వాలేదనిపించిన భారత్‌ శనివారం మాత్రం తేలిపోయింది. ఇంగ్లాండ్‌ లోయర్ ఆర్డర్‌ను పెవిలియన్‌కు చేర్చడంలో భారత బౌలర్లు విఫలం కావడం, మరోవైపు బ్యాట్స్‌మెన్‌ కూడా ఆకట్టుకోలేకపోయారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. పుజారా (37), రాహుల్‌ (37) ఫర్వాలేదనిపించారు.

జడేజాకు నాలుగు, బుమ్రా.. ఇషాంత్‌లకు మూడేసి వికెట్లు

జడేజాకు నాలుగు, బుమ్రా.. ఇషాంత్‌లకు మూడేసి వికెట్లు

క్రీజులో విహారి (25 బ్యాటింగ్‌), జడేజా (8 బ్యాటింగ్‌) ఉన్నారు. ఆండర్సన్‌, స్టోక్స్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. అంతకుముందు 198/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ జట్టులో జోస్ బట్లర్ (133 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 89), బ్రాడ్‌ (59 బంతుల్లో 3 ఫోర్లతో 38) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌ను 122 ఓవర్లలో 332 పరుగుల వద్ద ముగించింది. జడేజాకు నాలుగు, బుమ్రా.. ఇషాంత్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి.

Story first published: Sunday, September 9, 2018, 11:16 [IST]
Other articles published on Sep 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+