Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఛేజింగ్‌లో కోహ్లీ సూపర్బ్, అతడి దగ్గర పాఠాలు నేర్చుకుంటా: రూట్

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌పై ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ ప్రశంసలు కురిపించాడు. ఛేజింగ్‌లో కోహ్లీని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ జో రూట్ కితాబిచ్చాడు. తీవ్ర ఒత్తిడిలో కూడా కోహ్లీ పరుగుల ఛేజింగ్ చేసే విధానం అద్భుతమని, ఈ విషయంలో కోహ్లీని కలిసి బ్యాటింగ్ పాఠాలు నేర్చుకుంటానని అన్నాడు.

26 ఏళ్ల జో రూట్ ది గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు. 'ఆటలో రన్ ఛేజింగ్‌ అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. నిజం చెప్పాలంటే కోహ్లీనే బెస్ట్ అని చెప్పాలి. ఇప్పటివరకు ఛేజింగ్‌లో 15 సెంచరీలు చేశాడు. దీనిపై కోహ్లీతో కూర్చుని మాట్లాడాలని ఉంది. అయితే ఇప్పటివరకు ఆ అవకాశం నాకు లభించలేదు' అని జో రూట్ అన్నాడు.

ఇక ఇండియా, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సంద‌ర్భంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ కూడా జో రూట్‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు. జో రూట్ ఔట్‌స్టాండింగ్ ప్లేయ‌ర్ అని అన్నాడు. ప్రస్తుత స‌మ‌కాలీన క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, కేన్ విలియ‌మ్స‌న్‌, స్టీవ్ స్మిత్‌, జో రూట్‌ల‌ను అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌గా ప‌రిగ‌ణిస్తున్నారు.

దిగ్గజాల తర్వాత స‌త్తా ఉన్న ప్లేయ‌ర్స్ వీళ్లే

దిగ్గజాల తర్వాత స‌త్తా ఉన్న ప్లేయ‌ర్స్ వీళ్లే

స‌చిన్‌ టెండూల్కర్, రాహుల్ ద్ర‌విడ్‌, రికీ పాంటింగ్, జాక్వస్ క‌లిస్‌లాంటి దిగ్గ‌జాలు రిటైరైన త‌ర్వాత వారి స్థానాల‌ను భ‌ర్తీ చేసే స‌త్తా ఉన్న ప్లేయ‌ర్స్ వీళ్లే అని క్రీడా విశ్లేషకులు అంచ‌నా వేశారు. అందుకు త‌గిన‌ట్లే ఈ న‌లుగురూ ప్రపంచ క్రికెట్‌లో సత్తా చాటుతున్నారు. అయితే కోహ్లీ తాజాగా ఫామ్ విషయంలో మిగ‌తా ముగ్గురినీ వెన‌క్కి నెట్టేశాడు.

కోహ్లీతో పోటీప‌డిన జో రూట్

కోహ్లీతో పోటీప‌డిన జో రూట్

గ‌తేడాది కోహ్లీతో పోటీప‌డిన జో రూట్ కూడా పుణెలో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ చూసి మంత్ర‌ముగ్ధుడ‌య్యాడు. ప్ర‌పంచంలో అత్యుత్త‌మ బ్యాట్స్‌మ‌న్ కోహ్లినేన‌ని రూట్ కూడా తేల్చి చెప్పేశాడు. రన్ ఛేజింగ్‌లో కోహ్లీని మించిన మొనగాడు లేడని తేల్చి చెప్పాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ తన కెరీర్‌లో 27వ సెంచరీని నమోదు చేశాడు.

ఐదో వికెట్‌‌కు 200కు పైగా పరుగుల భాగస్వామ్యం

ఐదో వికెట్‌‌కు 200కు పైగా పరుగుల భాగస్వామ్యం

ఇంగ్లండ్‌ నిర్దేశించిన 351 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను కోహ్లీ-జాదవ్‌ల జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్‌‌కు 200కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఎక్కువ సమయం తన కొడుకు ఆల్‌ఫ్రెడ్‌తోనే గడుపుతా

ఎక్కువ సమయం తన కొడుకు ఆల్‌ఫ్రెడ్‌తోనే గడుపుతా

ఇదిలా ఉంటే ఇటీవలే తండ్రి అయిన జో రూట్‌ ఎక్కువ సమయం తన కొడుకు ఆల్‌ఫ్రెడ్‌తోనే గడపాలని భావిస్తున్నట్టు చెప్పాడు. అందుకే ఐపీఎల్‌ ఆడే అవకాశాన్ని సైతం వదులుకుంటున్నాడు. తన కెరీర్‌లోనే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రూట్‌తో ఒప్పందానికి అనేక జట్లు సంప్రదిస్తున్నప్పటికీ తాను అయిష్టత వ్యక్తం చేస్తున్నానని చెప్పాడు.

ఐపీఎల్‌లో ఆడే అవకాశం రావడం అదృష్టమే

ఐపీఎల్‌లో ఆడే అవకాశం రావడం అదృష్టమే

‘ఐపీఎల్‌లో ఆడే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. ఐపీఎల్‌ ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు. నా ఆటతీరు మెరుగవడానికి ఆ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతుంది' అని జో రూట్‌ చెప్పాడు. ప్రస్తుతం తన కొడుకు ఆల్‌ఫ్రెడ్‌తో ఎక్కువ సమయం గడపాలని అన్నాడు. ఈ సమయంలో కుటుంబంతో ఉండడం కంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదని, కాబట్టి ఐపీఎల్‌లో పాల్గొనడం లేదని జో రూట్ స్పష్టం చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+