Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌లో ఆడటం గర్వంగా భావిస్తున్నాను: అండర్‌సన్

India vs England: James Anderson says 2012 Test series victory over MS Dhoni and Co remains standout moment in his career

హైదరాబాద్: మరి కొద్ది రోజుల్లో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు సిద్ధంగా ఉన్న టీమిండియాపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌ క్రికెటర్లందరిలాగే అండర్సన్‌ దృష్టిలోనూ యాషెస్‌ సిరీస్‌ను మించిన టెస్టు సమరం లేదనంటున్నాడు. ఐతే 2012లో భారత్‌లో ఆడిన టెస్టు సిరీస్‌కు కూడా తన దృష్టిలో ఎంతో ప్రాధాన్యముందని అంటున్నాడు ఈ స్వింగ్‌ బౌలర్‌.

'నేను ఆడిన అత్యుత్తమ సిరీస్‌ల్లో 2012లో భారత్‌లో ఆడిన సిరీస్‌ కూడా ఒకటి. 'భారత్‌లో వికెట్లన్నీ స్పిన్నర్లకే పడతాయి. పేసర్లు విజయవంతం కావడం కష్టమే' అనే వ్యాఖ్యలు ఎప్పుడూ వినపడేవే. ఈ నేపథ్యంలో భారత్‌కు వెళ్లిన నాకు ఆ సిరీస్‌ కెరీర్‌లో గర్వించే సిరీస్‌ అయింది' అని అన్నాడు. ఆ సిరీస్‌ను ఇంగ్లాండ్‌ 2-1తో గెలవడంలో అండర్సన్‌ కీలక పాత్ర పోషించాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు.

ఆ ప్రదర్శనను యాషెస్‌లో తన అనేక ప్రదర్శనలతో సమానంగా చూస్తానని అండర్సన్‌ చెప్పాడు. పనిలో పనిగా కోహ్లీపైనా కామెంట్లు విసిరాడు. టీమిండియా గెలుస్తున్నంత కాలం తాను పరుగులు చేయకపోయినా పర్వాలేదంటూ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన వ్యాఖ్యల్ని విభేదించాడు. ఇలా అంటే కోహ్లి అబద్ధమాడుతున్నట్లే అని అతనన్నాడు. క్రితం సారి ఇంగ్లండ్‌ పర్యటనలో విరాట్‌ కోహ్లీ దారుణ ఆటతీరుతో విమర్శల పాలయ్యాడు.

గత రెండు ఇంగ్లాండ్‌ పర్యటనల్లో కోహ్లి విఫలమైనప్పటికీ.. ఈసారి అలాగే ఆడతాడనుకోవడానికేమీ లేదని అండర్సన్‌ అభిప్రాయపడ్డాడు. ప్రతి ఆటగాడూ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటాడని.. అన్నాడు. రాబోయే సిరీస్‌లో అతడికి, తమ బౌలర్లకు పోరు రసవత్తరంగా ఉంటుందని అండర్సన్‌ చెప్పాడు.

Story first published: Wednesday, July 25, 2018, 12:05 [IST]
Other articles published on Jul 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+